AxisBank
-
పుంజుకుంటున్న ప్రముఖ కంపెనీ షేరు ధర.. కారణం ఇదే..
పేటీఎం కంపెనీ షేరు ధర ఇటీవల భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. ఇందుకు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయమే కారణమని నిపుణులు తెలిపారు. అయితే వరుసగా రెండో రోజు సోమవారం వన్97 కమ్యూనికేషన్స్ షేరు (పేటీఎం) భారీగా పుంజుకుంది. బీఎస్ఈలో షేరుధర సోమవారం ఐదు శాతం పెరిగి రూ.358.55 దగ్గర అప్పర్ సర్క్యూట్‌ను చేరింది. మర్చంట్ సెటిల్మెంట్ల కోసం యాక్సిస్ బ్యాంక్‌తో చేతులు కలుపుతున్నట్లు ప్రకటించింది. ఈ తరుణంలో కంపెనీ షేర్లు లాభాల బాటపట్టాయి. పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తమ నోడల్ ఖాతాను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంకుకు మార్చింది. ఇందువల్ల పేటీఎం క్యూఆర్, సౌండ్‌బాక్స్, కార్డ్ మెషీన్ సేవలు మార్చి 15 తరవాత కూడా యథావిధిగా కొనసాగుతాయని సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: బంగారం, వెండి ధరలు - ఈ రోజు ఎలా ఉన్నాయంటే.. పీపీబీఎల్‌పై ఆర్బీఐ ఇటీవల ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 29 తర్వాత ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్లు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లు, ఎన్‌సీఎంసీల్లోకి డిపాజిట్లు, టాప్-అప్లు స్వీకరించొద్దని ఆదేశించింది. తాజాగా ఆ గడువును మార్చి 15 వరకు పొడిగించింది. ఆర్బీఐ ఆంక్షల ప్రకటన తర్వాత కంపెనీ షేర్లలో పతనం కొనసాగుతూ వచ్చింది. యాక్సిస్ బ్యాంక్‌తో ఒప్పందం నేపథ్యంలో శుక్రవారం నుంచి కాస్త ఉపశమనం లభించింది. సోమవారం కూడా ఆ ర్యాలీ కొనసాగినట్లు తెలిసింది. -
నాలుగో రోజూ నష్టాలే
ట్రేడింగ్ చివర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. జనవరి నెల ద్రవ్యోల్బణ, డిసెంబర్ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెల్లడి కానుండటం(మార్కెట్ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వచ్చాయి)తో మార్కెట్లో అప్రమత్త వాతావారణం నెలకొన్నది. అంతర్జాతీయ సంకేతాలు పటిష్టంగానే ఉన్నప్పటికీ, మన స్టాక్ సూచీలు క్షీణించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 241 పాయింట్లు పతనమై 36,154 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 57 పాయింట్లు క్షీణించి 10,831 పాయింట్ల వద్ద ముగిశాయి. వరుసగా నాలుగో రోజూ స్టాక్‌సూచీలు నష్టపోయాయి. ఈ నాలుగు రోజుల్లో సెన్సెక్స్ మొత్తం 821 పాయింట్లు నష్టపోయింది. రియల్టీ, ఐటీ, ఎఫ్ఎమ్సీజీ, బ్యాంక్, వాహన, వినియోగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. లోహ, ఫార్మా, మౌలిక రంగ షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ ఒక దశలో 70 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 281 పాయింట్లు నష్టపోయింది. ఇంట్రాడే గరిష్టం నుంచి చూస్తే, సెన్సెక్స్ 300కు పైగా పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 351 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 22 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 65 పాయింట్లు నష్టపోయింది. ‘యాక్సిస్’ ఓఎఫ్‌ఎస్‌కు రూ.8,000 కోట్ల బిడ్లు యాక్సిస్ బ్యాంక్ ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)కు సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. వీరికి కేటాయించిన వాటా 2.56 రెట్లు ఓవర్ సబ్ స్క్రైబయింది. ఇందులో భాగంగా సంస్థాగత ఇన్వెస్టర్లకు 4.56 కోట్ల ఈక్విటీ షేర్లు రిజర్వ్ చేయగా, 11.69 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. విలువ రూ.8,000 కోట్లుగా ఉంది. నియోజెన్ కెమికల్స్ ఐపీఓకు ఓకే స్పెషాల్టీ కెమికల్స్ తయారు చేసే కంపెనీ నియోజెన్ కెమికల్స్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓలో భాగంగా రూ.70 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. అంతే కాకుండా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)విధానంలో కంపెనీ ప్రమోటర్లు 29 లక్షల షేర్లను విక్రయిస్తారు. ఈ ఐపీఓ నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగిస్తారు. -
250 కోట్లు కాదు..రూ.4వేలకోట్ల స్కాం
సాక్షి, ముంబై: రూ.250 కోట్ల బ్యాంకింగ్ కుంభకోణం ఆరోపణలతో ముంబైకి చెందిన పరేఖ్ అల్యూమినిక్స్ లిమిటెడ్ (పీఏఎల్) డైరెక్టర్లు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ స్కాంపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా పోలీసులు సంస్థకు చెందిన ముగ్గురు డైరెక్టర్లను ఆర్థిక నేరాల విభాగం అధికారులు అరెస్టు చేశారు. అంతేకాదు గతకొన్నేళ్ల క్రితం వెలుగు చూసిన ఈ స్కాం విలువ వేలకోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ స్కాం మొత్తంవిలువ రూ .4,000 కోట్లుగా ఉందని ప్రయివేటురంగ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు తన తాజా ఫిర్యాదులో పేర్కొంది. 20పైగా బ్యాంకుల గ్రూపును పీఏఎల్ మోసం చేసింది. బూటకపు కంపెనీల పేరుతో మోసపూరితమైన నకిలీ ఇన్వాయిస్లు, బిల్లులతో కుంభకోణానికి పాల్పడ్డారని బ్యాంకు ఆరోపించింది. దీంతో ఫోర్జరీ, నిబంధనల ఉల్లంఘన, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భవార్‌లాల్ భండారి, ప్రేమల్ గోరఖ్‌నాథ,కమేలష్ కనుంగోలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో బ్యాంకు అధికారుల పాత్రపై అధికారులు ఇంకా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. 2011లోనే పరేఖ్ నేతృత్వంలోని పీఏఎల్ రూ. 127.5కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 22 బ్యాంకులతో కలిపి ఇచ్చే రుణ ఒప్పందంలో భాగంగా ఈకుంభకోణం జరిగిందని ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. సంస్థ డైరెక్టర్లు అమితాబ్ పరేఖ్ (2013 లో మరణించారు), రాజేంద్ర గోథీ, దేవన్షు దేశాయ్, కిరణ్ పారిక్, విక్రమ్ మొర్దానీ పేర్లనుకూడా తన ఫిర్యాదులో చేర్చింది. కాగా పరేఖ్ అల్యూమినిక్స్ ఎస్బీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సహా ప్రభుత్వ బ్యాంకులనుంచి ఆరోపణలనెదుర్కొంటోంది. ఇప్పటికే ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. -
వడ్డీరేట్లు పెంచిన యాక్సిస్ బ్యాంకు
ముంబై : యాక్సిస్ బ్యాంకు తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)ను మరోసారి పెంచింది. మూడు నెలల కాలం నుంచి మూడేళ్ల కాలం వరకున్న రుణాలపై ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం ఫిబ్రవరి 17 నుంచి అమల్లోకి వచ్చిందని కూడా పేర్కొంది. దీంతో బ్యాంకు మూడు నెలల ఎంసీఎల్ఆర్ ప్రస్తుతం 8.15 శాతంగా, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.30 శాతంగా, ఏడాది రేటు 8.40 శాతంగా ఉన్నట్టు బ్యాంకు స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. రెండు నెలల కాలంలోనే వడ్డీరేట్లను పెంచడం ఇది రెండోసారి. జనవరిలో ఎంసీఎల్ఆర్ను 5 బేసిస్ పాయింట్లు పెంచింది. ఎక్కువ ఎంసీఎల్ఆర్, బ్యాంకు డిపాజిట్ రేట్లు పెరగడానికి సూచిస్తుందని తెలుస్తోంది. గత రెండు నెలల కాలంలో బ్యాంకింగ్ రంగంలో లిక్విడిటీ పెరిగినట్టు తెలిసింది. బ్యాంకులు తమ డిపాజిట్లపై వ్యయాలు చెల్లించడం ఎంసీఎల్ఆర్తోనే ముడిపడి ఉంటుంది. -
యాక్సిస్ బ్యాంక్ గుడ్‌న్యూస్
ముంబై: దేశంలో అతిపెద్ద ప్రయివేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకు కూడా రుణ గ్రహీతలకు శుభవార్త అందించింది. వార్షిక హోం లోన్ వడ్డీ రేట్ల కోతను ప్రకటించింది. వార్షిక ఎంసీఎల్ఆర్ ను 15 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్నట్లు బుధవారం వెల్లడించింది. నవంబర్ 18 నుంచి ఈ తగ్గింపు రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. కాగా ఆర్బీఐ సూచనల మేరకు గత ఆగస్టులో 8.95 శాతం తగ్గింపు రేట్లను యాక్సిస్ బ్యాంకు ప్రకటించింది. తాజాగా మరోసారి రుణాలపై వడ్డీరేటును తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు ఫెస్టివ్ సీజన్ లో ప్రభుత్వరంగ దిగ్గజం ఎస్ బీఐ, మరో ప్రయివేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ ఇటీవల వడ్డీరేట్ల కోత పెట్టాయి. ముఖ్యంగా మహిళలకు వార్షిక హోం లోన్ వడ్డీ రేట్ల (ఎంసీఎల్ఆర్) ను 9.1 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.