సాక్షి, ముంబై: రూ.250 కోట్ల బ్యాంకింగ్ కుంభకోణం ఆరోపణలతో ముంబైకి చెందిన పరేఖ్ అల్యూమినిక్స్ లిమిటెడ్ (పీఏఎల్) డైరెక్టర్లు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ స్కాంపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా పోలీసులు సంస్థకు చెందిన ముగ్గురు డైరెక్టర్లను ఆర్థిక నేరాల విభాగం అధికారులు అరెస్టు చేశారు. అంతేకాదు గతకొన్నేళ్ల క్రితం వెలుగు చూసిన ఈ స్కాం విలువ వేలకోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ స్కాం మొత్తంవిలువ రూ .4,000 కోట్లుగా ఉందని ప్రయివేటురంగ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు తన తాజా ఫిర్యాదులో పేర్కొంది.
20పైగా బ్యాంకుల గ్రూపును పీఏఎల్ మోసం చేసింది. బూటకపు కంపెనీల పేరుతో మోసపూరితమైన నకిలీ ఇన్‌వాయిస్లు, బిల్లులతో కుంభకోణానికి పాల్పడ్డారని బ్యాంకు ఆరోపించింది. దీంతో ఫోర్జరీ, నిబంధనల ఉల్లంఘన, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భవార్‌లాల్ భండారి, ప్రేమల్ గోరఖ్‌నాథ,కమేలష్ కనుంగోలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో బ్యాంకు అధికారుల పాత్రపై అధికారులు ఇంకా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.
2011లోనే పరేఖ్ నేతృత్వంలోని పీఏఎల్ రూ. 127.5కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 22 బ్యాంకులతో కలిపి ఇచ్చే రుణ ఒప్పందంలో భాగంగా ఈకుంభకోణం జరిగిందని ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. సంస్థ డైరెక్టర్లు అమితాబ్ పరేఖ్ (2013 లో మరణించారు), రాజేంద్ర గోథీ, దేవన్షు దేశాయ్, కిరణ్ పారిక్, విక్రమ్ మొర్దానీ పేర్లనుకూడా తన ఫిర్యాదులో చేర్చింది. కాగా పరేఖ్ అల్యూమినిక్స్ ఎస్‌బీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సహా ప్రభుత్వ బ్యాంకులనుంచి ఆరోపణలనెదుర్కొంటోంది. ఇప్పటికే ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment