
సాక్షి, ముంబై : ప్రయివేటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా రుణ రేటు 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గింది. అన్ని కాలపరిమితుల రుణ రేట్లు 0.10 శాతం తగ్గాయి. తాజా నిర్ణయం బుధవారం నుంచీ అమల్లోకి వస్తుందని సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్ష ప్రారంభమైన రెండవరోజు హెచ్‌డీఎఫ్‌సీ తాజా ప్రకటన చేయడం గమనార్హం.
కాగా ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ కూడా ఆటో, గృహ, వ్యక్తిగత రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ను 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 5.75 శాతం) ను ఆర్‌బీఐ 35 పాయింట్ల మేర తగ్గించింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 5.4 శాతానికి దిగివచ్చింది.