నిజామాబాద్: ఆర్టీసీ ద్వారా ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేందుకు.. వారి ఆర్థికభారాన్ని తగ్గించేందుకు అధికారులు వివిధ రకాల ప్యాకేజీలను తీ సుకొచ్చారు. గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా మ హిళా ప్రయాణికులకు అనువుగా ఉండేందుకు టీ 9–30, టీ9–60 వంటి పథకాలను తీసుకొచ్చింది.
ఆటోల్లో ప్రయాణికులు వెళ్లకుండా పల్లెవెలుగు ద్వారా ప్రయాణం చేయడానికి ఈ పథకాలు ఉపయోగపడుతాయని ఆర్టీసీ భావిస్తోంది. అంతేకాకుండా తిరుపతి, అరుణాచల క్షేత్రంకు భక్తులు అధిక సంఖ్య లో వెళ్తున్నారు. వీరు టూరిస్టు బస్సులను నమ్మి మోసపోయిన ఘటనలున్నాయి. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి తిరుపతి, అరుణాచలం వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.
అరుణాచలం గిరి ప్రదర్శనకు..
తమిళనాడులోని అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణకు నిజామాబాద్ నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ బస్సులకు సంస్థ నియమ నిబంధనలకు అనుసరించి ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా నడుపుతారు.
ప్రయాణికుల సౌలభ్యం కోసం వారి కాలనీల్లో 30 మంది ప్రయాణికులు ఉంటే కాలనీకే బస్సు పంపిస్తారు. దీంతోపాటు కాణిపాకంతో పాటు గోల్డెన్ టెంపుల్, అరుణాచలం గిరి క్షేత్రం ఉంటుంది. ఈ నెల 30న నిజామాబాద్ నుంచి ప్రారంభించే బ స్సును పౌర్ణమి రోజు చేర్చేందుకు ఏర్పాటు చేశారు.
టీ9–30 కి.మీ వెళ్లే వారికి రాయితీ..
రెండు రోజుల క్రితం ఉమ్మడి జిల్లాలోని ప్రయాణికులకు ఆర్థికభారం తగ్గించేందుకు ఆర్టీసీ టీ9–30 పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రూ. 50 చెల్లిస్తే 30 కి.మీ ప్రయాణం చేయవచ్చు. టీ 9 పథ కాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అమలు ఉపయోగం ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి రా త్రి 9 గంటల వరకు ప్రయాణించవచ్చు.
టీ9 టిక్కెట్లు పల్లెవెలుగు బస్సు కండక్టర్ల వద్ద అందుబాటు లో ఉంటాయి. ఈ టికెట్ తీసుకుంటే ఒక్కొక్కరికి రూ.10 నుంచి రూ.30 వరకు ఖర్చు తగ్గుతుందన్నా రు. రూ.20 కాంబోతో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయా ణించే సదుపాయం ఉంది. ఆటోల్లో ప్రయాణించకుండా పల్లెవెలుగు ద్వారా ప్రయాణం చేయడానికి సులువుగా ఉంటుంది.
నిజామాబాద్ నుంచి తిరుపతికి..
గతేడాది ఆర్టీసీ తిరుపతికి ప్రత్యేక దర్శనం కల్పించడానికి బస్సులను ఏర్పాటు చేసింది. జిల్లా నుంచి ప్రతిరోజు తిరుపతి వెంకటేశ్వర దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటారు. అయితే ఆర్టీసీ తిరుపతి బస్సు టికెట్‌తో పాటు దర్శనం టికెట్ అందించడంతో ఈ బస్సులో ప్రయాణికుల సంఖ్య పెరిగింది.
జిల్లా కేంద్రం నుంచి తిరుపతికి బస్సులు వెళ్తున్నాయి. తిరుపతికి పెద్దలకు రూ. 3,190 కాగా పిల్లలకు రూ. 2,280 టికెట్ ధర ఉంది. ఈ బస్సులో ప్రయాణించడానికి నెలరోజుల ముందు బుకింగ్ చేసుకుంటే సీటు దొరికే అవకాశాలున్నాయి.
టీ9 టికెట్‌తో 60 కి.మీ వరకు..
ఉమ్మడి జిల్లాలోని ప్రయాణికులకు ఆర్థికభారం తగ్గించడానికి ఆర్టీసీ టీ9–60 పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రూ.100 చెల్లిస్తే 60 కి.మీ ప్రయాణం చేయవచ్చు. టీ9 పథకాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తున్నట్లు చెప్పారు.
ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. టీ9 టికెట్లు పల్లెవెలుగు బస్సు కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయి. ఈ టికెట్ ద్వారా ఒక్కొక్కరికి రూ. 20 నుంచి రూ. 40 వరకు ఖర్చు తగ్గుతుందన్నారు. రూ. 20 కాంబితో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే సదుపాయం ఉందన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
దైవదర్శనానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రయాణించేవారికి ఆర్టీసీ టీ9–30, టీ9–60 వంటి పథకాలను తీసు కొచ్చింది. ఈ పథకాలతో ప్రయాణించే వారికి ఆర్థికభారం తగ్గుతుంది. ఆటోలలో ప్రయాణించే బదులు బస్సుల్లో ప్రయాణించాలి. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. – జానీ రెడ్డి, ఆర్‌ఎం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment