
సౌమ్యరెడ్డి, యశ్వంత్‌రెడ్డి
చింతల్: కుత్బుల్లాపూర్ వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న శ్రీధర్‌రెడ్డి కుమార్తె సౌమ్యరెడ్డి, అల్లుడు యశ్వంత్ రెడ్డి లు వైద్యశాస్త్రంలో తమ ప్రావీణ్యతను చాటారు. మణిపాల్ కస్తూర్బా మెడికల్ కళాశాలలో డాక్టర్ సౌమ్యరెడ్డి ఎం.డి పీడియాట్రిక్ విభాగంలో బంగారు పతకం సాధించగా, ఉస్మానియా మెడికల్ కళాశాల ఆర్థోపెడిక్ విభాగంలో యశ్వంత్ రెడ్డి ఎండీ ఉస్మానియా మెడికల్ ఫలితాలలో ప్రతభ కనబరిచి బంగారు పతకం సాధించారు.
ఈ సందర్భంగా సౌమ్య తండ్రి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తమ కూతురు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే తపన ఉండేదని, తమ కుటుంబంలో ఎక్కువగా వైద్య రంగంలో రాణించిన వారే ఉన్నారన్నారు. తన కూతురు బంగారు పతకం సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు.

Comments
Please login to add a commentAdd a comment