‘ఈఎన్‌టీ’లో సిబ్బంది కొరతను పరిష్కరించాలి
సుల్తాన్‌బజార్: కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్ల కొరత ఉందని, ఈ సమస్యను పరిష్కరించేవిధంగా కృషి చేయాలని టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేనికి ఈఎన్‌టీ టీఎన్జీఓస్ యూనియన్ అధ్యక్షుడు తూంకుంట రాజు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈఎన్‌టీ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్ల ఉద్యోగుల కొరత ఉన్నందున రోజు 1,500 నుంచి రెండు వేలమంది రోగులకు మందులు అందించడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొన్నారు. తద్వారా మెడికల్ స్టోర్స్, సబ్‌స్టోర్స్ నిర్వహించడంలో సిబ్బందికి పనిభారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలకు కావాల్సిన మిషనరీలను నిర్వహించేందుకు సైతం ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని మారం జగదీశ్వర్, ముజీబ్ హుస్సేనిలు హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి భాస్కర్, కోశాధికారి రవి, సునీల్, సురేందర్ రెడ్డి, అర్షద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment