15 రోజులు.. 4 చోరీలు
లాలాపేట: బీఫార్మసీ పూర్తి చేసినా..జల్సాల కోసం చోరీలకు తెగబడుతున్న కరడుగట్టిన దొంగ శంకర్‌నాయక్‌ను మరోసారి పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అతన్ని మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. అనంతరం ఈస్ట్‌జోన్ డీసీపీ బాలస్వామి తదితరులు మాట్లాడుతూ శంకర్ నాయక్ దొంగతనాల చిట్టా విప్పారు. ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీలపై అందిన పలువురి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా విశ్వసనీయ సమాచారంతో శంకర్ నాయక్‌తో పాటు మరో దొంగను ఎల్బీనగర్‌లో అరెస్ట్ చేసి రూ.9 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే వందకు పైగా దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి..ఈ మధ్యనే బెయిల్‌పై బయటకు వచ్చిన శంకర్‌నాయక్..15 రోజుల వ్యవధిలోనే 4 చోరీలకు పాల్పడిన్నట్లు పోలీసులు వివరించారు. ఓయూ పీఎస్‌తో పాటు పటాన్‌చెరు, మియాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇళ్ల తాళాలు పగులకొట్టి చోరీలు చేసినట్లు విచారణలో తేలిందన్నారు. శంకర్‌నాయక్ నుంచి 11 తులాల బంగారు ఆభరణాలతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. దొంగిలించిన వస్తువుల వివరాలను పేపర్‌పై రాసి గోడకు అతికించడంతో పాటు..ఏ ఇంట్లో ఎలా..ఏమేం చోరీ చేశాడో కూడా శంకర్ నాయక్ తన డైరీలో రాసుకుంటాడని పోలీసులు వివరించారు.
కరడుగట్టిన దొంగ శంకర్‌నాయక్ అరెస్టు
ఇప్పటికే వందకుపైగా దొంగతనాలు.. పలుమార్లు జైలుకు సైతం..
Comments
Please login to add a commentAdd a comment