మణికొండ: పద్నాలుగు ఏళ్ల బాలిక.. కవిత్వాలతో కూడిన పుస్తకం రాయడం అభినందనీయమని ఏఐజీ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. కోకాపేట జయభేరి పీక్‌లో ఆదివారం సాయంత్రం ‘మ్యూజింగ్ ఆఫ్ ఏ టీనేజ్ గర్ల్’ కవితా పుస్తకాన్ని ఆయనతో పాటు సైంట్ సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, ఏఎస్‌సీఐ చైర్మన్ కె.పద్మనాభయ్య ఆవిష్కరించారు.
ఓక్రిడ్జ్ స్కూల్‌లో చదువుతున్న సంజన సోమవరపు ఈ పుస్కకాన్ని రచించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పుస్తకంలోని కవిత్వం కౌమార భావోద్వేగాలు సమ్మిళితమై ఉన్నాయన్నారు. అనంతరం సంజన మాట్లాడుతూ.. తన తాత, రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ హరిప్రసాద్ నుంచి కవిత్వం రాయాలన్న ప్రేరణ కలిగిందన్నారు. పుస్తకాన్ని తన ఉపాధ్యాయురాలు రోసలిండ్, తన తాతకు అంకితం చేస్తున్నానన్నారు. కార్యక్రమంలో సంజన తల్లితండ్రులు రేఖ, శశితో వారి పాటు బంధుమిత్రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment