లక్నో: యూపీలోని యోగి సర్కారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. దీపావళికి ముందుగానే ఉద్యోగులకు డీఏ, బోనస్‌లను అందించనున్నట్లు తెలిపింది.
రాష్ట్రంలోని దాదాపు ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు దీపావళి బోనస్‌తో ప్రయోజనం పొందనున్నారు. అలాగే 15 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు పరిధిలోకి రానున్నారు. డీఏను 50 శాతం నుంచి 54 శాతానికి పెంచనున్నారు. దీని ప్రయోజనాలు జూలై నెల నుంచి లెక్కించనున్నారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బోనస్‌గా రూ.7 వేలు వరకూ అందుకున్నారు.
మరోవైపు డియర్‌నెస్ అలవెన్స్ పెంచుతున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకోసం సన్నాహాలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని పెంచుతున్నప్పుడల్లా రాష్ట్ర సర్కారు కూడా ఈ పెంపుదలని అమలు చేస్తూవస్తోంది. ఈ పెంపుపై త్వరలో ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment