
అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకి ఏపీఎస్ ఆర్టీసీ తియ్యటి వార్త చెప్పింది. విశాఖ నుంచి అరుణాచల గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.రవికుమార్ వెల్లడించారు.
సాక్షి, విశాఖపట్నం: అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకి ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. విశాఖ నుంచి అరుణాచల గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.రవికుమార్ వెల్లడించారు.
వచ్చే నెల 3వ తేదీ నుంచి బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు. 3న విశాఖలోని ద్వారక బస్‌స్టేషన్ నుంచి బయలు దేరి కాణిపాకం, శ్రీపురం, అరుణాచలం, కంచి, శ్రీకాళహస్తి క్షేత్రాల దర్శనం ఉంటుందన్నారు.
5న పౌర్ణమి రోజున అరుణాచల గిరి ప్రదక్షిణ అనంతరం 7న తేదీన విశాఖకి చేరుకుంటోందన్నారు. టికెట్స్ కావాల్సిన www.apsrtconline.inలో ద్వారా ఆన్ లైన్‌లో బుక్ చేసుకునే సౌలభ్యం ఉందన్నారు. అలాగే అదనపు సర్వీసులు కూడా నడపడానికి ఏపీఎస్ ఆర్టీసీ సిద్ధంగా ఉందని రవికుమార్ పేర్కొన్నారు.
చదవండి: అలర్ట్: తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన వాతావరణం