మంత్రి హరీశ్‌రావును గజమాలతో సత్కరిస్తున్న మహిళలు
సాక్షి, సిద్దిపేట: ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చిన రాష్ట్రాన్ని పొరపాటున కాంగ్రెస్ చేతిలో పెడితే కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లేనని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విమ ర్శించారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు తాగేందుకు నీళ్లు ఇవ్వలేకపోయిందన్నారు. సోమ వారం సిద్దిపేట బస్టాండ్‌లో బీపీ చెకప్ కేంద్రం, స్వయం ఉపాధి శిక్షణ పొందే మహిళా ప్రాంగణం, వృద్ధాశ్రమం, జిల్లా మహిళా సమాఖ్య భవనాలను మంత్రి హరీశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ల పెంపు, గ్యాస్ ధర తగ్గింపుపై రేపో, ఎల్లుండో సీఎం కేసీఆర్ శుభవార్త చెబుతారన్నారు.
రాష్ట్రంలో వైద్య వ్యవస్థను బలోపేతం చేశామని... ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని తెలిపారు. గతంలో రాష్ట్ర ప్రజలు ఇతర ప్రాంతాలకు కూలి పనులకు వెళ్లే వారని... ఇప్పుడు పక్క రాష్ట్రాల వారికి కూలీ ఇచ్చే పరిస్థితికి వచ్చామన్నారు. వీవోలను ఆదుకున్నది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని... ఉద్యోగస్తులతోపాటు వారికి కూడా పీఆర్సీ వర్తింపజేశామన్నారు.
‘దేశమంతా తెలంగాణ రాష్ట్రం వైపు చుస్తోంది.. ఇక్కడ అమలవుతున్న రైతు బంధు, బీమా, ఆసరా పెన్షన్‌లు దేశంలో ఎక్కడా లేవు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా సిద్దిపేటలో మహిళా భవనం, వృద్ధాశ్రమం ఏర్పాటు చేశాం’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment