ప్రధాని నరేంద్ర మోదీతో సూర్యప్రసాద్
పరిగి: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అందుకున్న ఏపీఆర్‌ఎస్ కొడిగెనహళ్లి విద్యార్థి రాగే సూర్య ప్రసాద్‌ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి ఢిల్లీలో అభినందించారు. ఏపీఆర్‌ఎస్ కొడిగెనహళ్లిలో 5వ తరగతి చదువుతున్న రాగే సూర్య ప్రసాద్, గతేడాది కిలిమంజారోతో పాటు లద్దాఖ్‌లోని దక్షిణ పుల్లు పర్వతాన్ని అధిరోహించాడు. దీంతో కేంద్ర ప్రభుత్వం స్పోర్ట్స్ విభాగంలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌కు ఎంపిక చేసింది.
ఈనెల 22న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు అందజేశారు. 23వ తేదీ రాత్రి ప్రధాని నరేంద్రమోదీ సూర్యప్రసాద్‌తో పాటు రాష్ట్రీయ బాల పురస్కార్‌కు ఎంపికైన బాలలతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సూర్యప్రసాద్‌ను ప్రత్యేకంగా అభినందించారు. తమ పాఠశాల విద్యార్థికి జాతీయ స్థాయి అవార్డు దక్కడం సంతోషంగా ఉందని పాఠశాల ప్రిన్సిపాల్ మురళీధర్, ఉపాధ్యాయులు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment