వనపర్తి: కేంద్ర ప్రభుత్వం రైల్వేరంగం అభివృద్ధిపై దృష్టిసారించడంతో కొత్త రైల్వేలైన్లపై ఆశలు చిగురిస్తున్నాయి. గద్వాల– డోర్నకల్ (మహబూబాబాద్) మధ్య రైల్వేలైన్ సర్వే కోసం ఆదేశాలు జారీ కావడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల మధ్య కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి మార్గం సుగమమవుతుంది. కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కావడం పట్ల జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోంది.
దీనికి సంబంధించి పైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్)కు కేంద్ర ప్రభుత్వం రూ.7.40 కోట్లు విడుదల చేసింది. దీంతో 296 కి.మీ., పొడవైన గద్వాల నుంచి వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట మీదుగా డోర్నకల్ వరకు రైల్వేలైన్‌కు సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేల అనంతరం ఇచ్చే నివేదిక ఆధారంగా ఆ మార్గంలో కొత్త రైల్వేలైన్ ఏర్పాటుకు నిధులు మంజూరయ్యే అవకాశం ఉంటుంది.
తాజాగా విడుదలైన నిధులతో రైల్వేలైన్‌కు సంబంధించిన సర్వే పనులు త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మేరకు గత నెల 26న కేంద్ర రైల్వేబోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ప్రాజెక్టుల్లో మౌలిక వసతులు, డబ్లింగ్, మల్టీ ట్రాకింగ్ తదితర పనులకు అనుమతులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment