
దాహం తీరేనా..?!
శ్రీశైలం జలాశయంలో వేగంగా తగ్గుతున్న నీటిమట్టం
తాగునీటి అవసరాలకే..
ప్రస్తుతం తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కేఎల్‌ఐ ప్రాజెక్టు వద్ద 818 అడుగుల మేరకు కృష్ణానదిలో బ్యాక్ వాటర్ ఉంది. 800 అడుగుల వరకు తాగునీటి అవసరాలకు నీటిని ఎత్తిపోసుకోవచ్చు. తాగునీటి అవసరాలను బట్టే ఎత్తిపోతలు సాగుతున్నాయి. కృష్ణానదిలో బ్యాక్ వాటర్ నిల్వలు, మిషన్ భగీరథ అవసరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాం. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథకు నీటిని మళ్లించేందుకు చేపట్టిన పనులు తుదిదశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే తాగునీటి అవసరాలకు ఎప్పటికీ ఢోకా ఉండదు.
– అంజద్ పాషా, డీఈఈ, మిషన్ భగీరథ
● మిషన్ భగీరథ అవసరాలకు
కేఎల్‌ఐ ద్వారా ఎత్తిపోతలు
● వేసవిలో నీటి ఎద్దడి లేకుండా
చూసేందుకు చర్యలు
● యాసంగి సీజన్ ముగియడంతో
నిలిచిన సాగునీటి సరఫరా
● నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణంతో లభించనున్న శాశ్వత పరిష్కారం
ప్రస్తుతం శ్రీశైలంలో
ఉన్న నీరు
38.86 టీఎంసీలు
ఇందులో వాడుకునే అవకాశం ఉన్నది 1.86 టీఎంసీలు
కొల్లాపూర్: శ్రీశైలం బ్యాక్‌వాటర్ లెవెల్స్ క్రమంగా తగ్గుతుండటంతో తాగునీటి అవసరాలపై అధికారులు దృష్టిసారించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు చేపట్టారు. ఇందుకోసం కేఎల్‌ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా కొల్లాపూర్ మండలం ఎల్లూరులో మిషన్ భగీరథ పంప్‌హౌజ్ నిర్మించారు. ఇక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లా 3 నియోజకవర్గాల పరిధిలోని 84 మండలాల ప్రజలకు తాగునీరు అందించేందుకు పైప్‌లైన్లు, వాటర్ ట్యాంకులు నిర్మించి నీటి సరఫరా చేస్తున్నారు. అయితే వేసవిలో ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తలెత్తకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు.
తగ్గుతున్న నీటిమట్టం..
వేసవి ప్రభావంతో శ్రీశైలంలో బ్యాక్‌వాటర్ లెవెల్స్ వేగంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం డ్యాంలో 818 అడుగుల వద్ద 38.86 టీఎంసీల నీరు ఉండగా.. మిషన్ భగీరథ కోసం 800 అడుగుల (37.0 టీఎంసీల డెడ్ స్టోరేజీ) వరకు నీటిని వినియోగించుకునే వెసులుబాటు ఉంది. కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం తాగు, సాగునీటి అవసరాల కోసం నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇప్పటికే యాసంగి సీజన్ ముగియడంతో సాగునీటి సరఫరా నిలిపివేసి.. కేవలం తాగునీటి కోసమే ఎత్తిపోతలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
నీటి అవసరాలు తీర్చేలా...
మిషన్ భగీరథ పథకానికి రోజూ 0.2 టీఎంసీల నీళ్లు అవసరం. కేఎల్‌ఐ ప్రాజెక్టు పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు. ఒక్కసారి రిజర్వాయర్‌ను నింపితే దాదాపుగా 18 రోజులపాటు తాగునీటి అవసరాలు తీరుతాయి. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్ వాటర్ లెవెల్స్ ప్రకారం వేసవి పూర్తయ్యే వరకు నీటిని ఎత్తిపోసుకునే వీలుంది. తాగునీటి కేటాయింపుల ప్రకారమే శ్రీశైలం బ్యాక్ వాటర్ వినియోగం ఉంటుంది.
జలాశయం
డెడ్ స్టోరేజీ 37.0
టీఎంసీలు
కేఎల్‌ఐ కాల్వ అప్రోచ్ కెనాల్‌లో కృష్ణా బ్యాక్‌వాటర్
మిషన్ భగీరథకు ప్రతిరోజు
అవసరమైన నీరు
0.2 టీఎంసీలు

దాహం తీరేనా..?!

దాహం తీరేనా..?!