నాడు సర్పంచ్‌.. నేడు న్యాయమూర్తి | Sakshi
Sakshi News home page

నాడు సర్పంచ్‌.. నేడు న్యాయమూర్తి

Published Tue, Jan 30 2024 1:46 AM

జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికై న సంతోషలక్ష్మి  - Sakshi

వజ్రపుకొత్తూరు రూరల్‌: మండలం నగరంపల్లి గ్రామానికి చెందిన కర్రి సంతోషలక్ష్మి న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. సంతోషలక్ష్మి ఇదివరకు సర్పంచ్‌గా కూడా సేవలు అందించారు. ఆ తర్వాత న్యాయ శాస్త్రం చదివి న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తూనే న్యాయమూర్తి కావాలన్న ఆశయంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు సోమవారం విడుదలైన జూనియర్‌ సివిల్‌ జడ్జి పరీక్ష ఫలితాల్లో విజయం సాధించి న్యాయమూర్తిగా ఎంపికయ్యారు.

దీంతో కుటుంబ సభ్యులు,గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భర్త దువ్వాడ వెంకటకుమార్‌ చౌదరి ప్రోత్సాహంతో ఆమె విజయం సాధించారు. ఆమె న్యాయమూర్తిగా ఎంపిక కావడంపై అంబేడ్కర్‌ యూనివర్సిటీ పూర్వ వీసీ హనుమంతు లజపతిరాయ్‌, రాజ్యలక్ష్మి, పీఎసీఎస్‌ అధ్యక్షుడు దువ్వాడ మధుకేశ్వరరావు, సర్పంచ్‌ దువ్వాడ పద్మావతి, ఎంపీటీసీ బమ్మిడి రాజ్యలక్ష్మి, బి.మోహన్‌రావు, దువ్వాడ జయరాం చౌదరి తదితరులు అభినందనలు తెలియజేశారు.

Advertisement
Advertisement