దబాంగ్‌ 3: రెండో రోజు సేమ్‌ కలెక్షన్లు.. | Dabangg 3: Day 2 Box Office Collection | Sakshi
Sakshi News home page

బాక్సాఫీస్‌ దగ్గర స్థిరంగా చుల్‌బుల్‌పాండే

Published Sun, Dec 22 2019 11:39 AM | Last Updated on Sun, Dec 22 2019 4:15 PM

Dabangg 3: Day 2 Box Office Collection - Sakshi

చుల్‌బుల్‌ పాండేగా బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ దబాంగ్‌ 3తో ముచ్చటగా మూడోసారి వచ్చాడు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సల్మాన్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హ నటించారు. భారీ అంచనాలతో వచ్చిన చుల్‌బుల్‌పాండే మరోసారి మురిపిస్తాడనుకుంటే ఈసారి తడబడినట్లు తెలుస్తోంది. అయితే, సినీ విశ్లేషకుల విమర్శలు, తక్కువ రేటింగ్‌లు, దేశంలో కొనసాగుతున్న నిరసనలు ఇవేవీ దబాంగ్‌ 3 కలెక్షన్లకు అడ్డుగా నిలవకపోవడం గమనార్హం. దబాంగ్‌ 3 విడుదలైన శుక్రవారం నాడు రూ.24 కోట్లు రాబట్టగా రెండో రోజు కూడా స్థిరంగా నిలబడి రూ.24 కోట్లు వసూలు చేయడం విశేషం. వీకెండ్‌ కాబట్టి కలెక్షన్లకు ఎలాంటి ఢోకా ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు. దబాంగ్‌ 3 క్రేజ్‌ వీక్‌డేస్‌లో కొనసాగుతుందా? సోమవారం నుంచి ఈ సినిమా ఏమేరకు వసూళ్లు రాబడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement