
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ దబాంగ్ మూవీ రికార్డులను క్రియేట్ చేయగా.. సినిమాలోని తన పాత్రపై సల్మాన్ ప్రత్యేక అభిమానాన్ని పెంచుకున్నారు. దీనిలో భాగంగానే సీక్వెల్‌ను కూడా తీశారు. అయితే.. సీక్వెల్‌గా తీసిన దబాంగ్2 అంతగా మెప్పించలేకపోయింది. మళ్లీ మూడో సిరీస్‌ను సిద్దం చేస్తున్నాడు సల్మాన్ భాయ్.
ప్రభుదేవా డైరెక్షన్‌లో ‘దబాంగ్3’ చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ఈ మూవీ మొదటి షెడ్యూల్‌ను మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌లో ప్రారంభించాడు. అక్కడ షూటింగ్ చేస్తుండగా.. ఓ పురాతన విగ్రహం ధ్వంసమైందనే వార్త వైరల్ అయింది. అయితే మొత్తానికి దబాంగ్3 చిత్రబృందం మొదటి షెడ్యూల్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఇందులో కూడా సోనాక్షి సిన్హానే హీరోయిన్‌గా తీసుకున్నారు. వాంటెడ్ చిత్రం తరువాత ప్రభుదేవా డైరెక్షన్‌లో సల్మాన్ ‘దబాంగ్3’ని చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment