ఇరగదీసిన సూపర్‌ స్టార్స్‌.. | Salman Khan Dance With Venkatesh And Ram Charan In Dabangg 3 Event | Sakshi
Sakshi News home page

ఇరగదీసిన సూపర్‌ స్టార్స్‌..

Published Wed, Dec 18 2019 8:09 PM | Last Updated on Wed, Dec 18 2019 8:24 PM

Salman Khan Dance With Venkatesh And Ram Charan In Dabangg 3 Event - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ తాజా చిత్రం దబాంగ్‌ 3. హిందీతో పాటు తమిళ్‌, తెలుగు, కన్నడ భాషల్లోనూ విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ బుధవారం జేఆర్సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్‌ హీరోలు రామ్‌చరణ్‌, వెంకటేశ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌, వెంకటేశ్‌లతో కలిసి సల్మాన్‌ చిందులేశారు. వేదికపై ముగ్గురు స్టార్స్‌ కలిసి చేసిన డ్యాన్స్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. 

దబాంగ్‌ సీరిస్‌లో రెండు విజయవంతమైన చిత్రాలను సల్మాన్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సల్మాన్‌కు వాంటెడ్‌(పోకిరి రీమేక్‌)తో విజయాన్ని అందించిన ప్రభుదేవా.. దబాంగ్‌ 3తో మరో హిట్‌ను అందిస్తారని అంతా భావిస్తున్నారు. సోనాక్షి సల్మాన్‌ భార్యగా నటిస్తుండగా.. ప్లాష్‌బ్యాక్‌లో సయీ మంజ్రేకర్‌తో ఆయన ఆడిపాడనున్నారు. దబాంగ్‌ మొదటి రెండు బాగాల్లో కనిపించిన అర్బాజ్‌ఖాన్‌, మహీగిల్‌ తమ పాత్రలను నిలుపుకోగా, కన్నడ సూపర్‌స్టార్‌ కిచ్చా సుదీప్‌ విలన్‌ పాత్ర పోషిస్తున్నాడు. డిసెంబర్‌ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement