
ప్రభుదేవా, సల్మాన్‌ఖాన్
... అంటున్నారు నటుడు, దర్శకుడు ప్రభుదేవా. సల్మాన్‌ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో 2009లో వచ్చిన ‘వాంటెడ్’ చిత్రం హిట్‌గా నిలిచింది. ఇది మన తెలుగు ‘పోకిరి’కి రీమేక్. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ సల్మాన్ హీరోగా ప్రభుదేవా ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సూపర్ హిట్ సిరీస్ ‘దబాంగ్’లో మూడో భాగం ఇది. ‘దబాంగ్–3’ పేరుతో తెరకెక్కించనున్నారు. కాగా, ‘దబాంగ్ టూర్’ పేరుతో సల్మాన్ పలు ప్రదేశాల్లో పర్యటిస్తున్నారు. ప్రభుదేవా కూడా ఆయనతో ఉన్నారు. ఈ సందర్భంగా సల్మాన్ గురించి ప్రభుదేవా మాట్లాడుతూ– ‘‘సల్మాన్‌తో సినిమా అంటే నాకు ఛాలెంజ్‌తో కూడుకున్న పని.
ఛాలెంజ్‌ని నేనెప్పుడూ ఒత్తిడిగా భావించను. సినిమా రిలీజ్ టైమ్‌లో మాత్రం ప్రేక్షకులు సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారా? అనే విషయంలో ఒత్తిడికి గురవుతుంటా. సల్లూ భాయ్ బాగా కష్టపడే వ్యక్తి. ఆయనలో సూపర్‌స్టార్ రజనీకాంత్ లక్షణాలు చాలా ఉన్నాయి. ఇద్దరికీ ఓ విభిన్నమైన స్టైల్ ఉంది. వారెప్పుడూ ఇతరులను మెప్పించాలనుకోరు. వారిని తెరపై చూసి మనమే మెస్మరైజ్ అవుతుంటాం’’ అన్నారు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో సోనాక్షీ సిన్హా కథానాయిక. ‘దబాంగ్’ కథానాయికగా ఆమెకు తొలి చిత్రమిదే అన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment