వాంటెడ్ డైరెక్టర్తో దబాంగ్ 3 | Salman Khan and Prabhu Deva to team up for DABANGG 3 | Sakshi
Sakshi News home page

వాంటెడ్ డైరెక్టర్తో దబాంగ్ 3

Published Tue, Jun 13 2017 3:55 PM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM

వాంటెడ్ డైరెక్టర్తో దబాంగ్ 3

వాంటెడ్ డైరెక్టర్తో దబాంగ్ 3

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరో సీక్వల్కు సిద్ధమవుతున్నాడు. వాంటెడ్ సినిమా తరువాత జెట్ స్పీడుతో సినిమాలు చేస్తున్న సల్మాన్, ఇటీవల ప్రయోగాత్మక చిత్రాలతోనూ ఆకట్టుకుంటున్నాడు. అయితే తనకు తిరుగులేని ఫాలోయింగ్ తీసుకొచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లను మాత్రం వదిలిపెట్టడం లేదు. అందుకే1 సక్సెస్ ఫుల్ దబాంగ్ సీరీస్లో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

దబాంగ్, దబాంగ్ 2 సినిమాతో బాక్సాఫీస్ రికార్డ్లను బద్ధలు కొట్టిన సల్లూ భాయ్ ఇప్పుడు దబాంగ్ 3ని రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఏక్తా టైగర్కు సీక్వల్గా తెరకెక్కుతున్న టైగర్ జిందాహై షూటింగ్లో బిజీగా ఉన్న సల్మాన్, త్వరలో దబాంగ్ సీక్వల్ను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ నిర్మాణంలో ప్రభుదేవ దర్శకత్వంలో దబాంగ్ 3 రూపొందనుంది. సల్మాన్ హీరోగా తెరకెక్కిన ట్యూబ్లైట్ ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement