‘ముసలి వ్యక్తి డ్యాన్స్‌ చేస్తున్నట్లుంది’ | Dabangg 3 Song Leaked Online Salman Khan Cannot Dance | Sakshi
Sakshi News home page

‘దబాంగ్‌ 3’ షూటింగ్‌ వీడియో లీక్‌

Published Wed, Apr 3 2019 5:28 PM | Last Updated on Wed, Apr 3 2019 5:58 PM

Dabangg 3 Song Leaked Online Salman Khan Cannot Dance - Sakshi

సల్మాన్‌ ఖాన్‌ అభిమానలు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘దబాంగ్‌ 3’ షూటింగ్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో లీక్‌ అవ్వడమే కాక తెగ వైరలవుతోంది. సల్మాన్‌ ఓ సాంగ్‌ షూటింగ్‌లో పాల్గొన్న వీడియో ఇది. నర్మదా నది ఒడ్డున షూట్‌ చేస్తోన్న ఈ పాటలో సల్మాన్‌ డ్యాన్స్‌ చూసిన జనాలు ఆయనను తెగ ట్రోల్‌ చేస్తున్నారు. ఆయనకు డ్యాన్స్‌ రావడం లేదని కొందరు కామెంట్‌ చేయగా.. ఓ ముసలి వ్యక్తి డ్యాన్స్‌ చేయడానికి ప్రత్నిస్తే ఎలా ఉంటుందో సల్మాన్‌ డ్యాన్స్‌ చేస్తే అలానే ఉంది.. ఆయన బరువు తగ్గాలి అని కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు. దాంతో ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తొలగించారు.

అయితే ఇలా వీడియో లీక్‌ అవ్వడం పట్ల సల్మాన్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైరసీ విషయంలో జాగ్రత్త తీసుకోనందుకు సదరు ఫోటోగ్రాఫర్‌ మీద మండిపడుతున్నారు. ప్రస్తుతం దబాంగ్‌ 3 ఇండోర్‌లోని మండలేశ్వర్‌ మహేశ్వర్‌లో షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ ప్రదేశాలతో సల్మాన్‌కు ఓ అనుబంధం ఉంది. అర్బాజ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఇద్దరు జన్మించింది ఇండోర్లో కాగా వీరి తాత మండలేశ్వర్‌ మహేశ్వర్‌ ప్రాంతంలోనే పోలీసుగా బాధ్యతలు నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement