![Sudeep to Play a Villain in Salman Khan Dabangg 3 - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/20/Salman%20Khan.jpg.webp?itok=nMpRWLih)
సౌత్ సినిమాల్లో విలక్షణ పాత్రలతో ఆకట్టుకున్న కన్నడ స్టార్ హీరో సుధీప్. ఈగ సినిమాతో విలన్‌గా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న సుధీప్, మరోసారి బాలీవుడ్‌లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. సాండల్‌వుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఇతర భాషల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న సుధీప్ త్వరలో బాలీవుడ్ సినిమాలో విలన్‌గా నటించనున్నాడు.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ హీరోగా సూపర్ హిట్ అయిన సిరీస్ దబాంగ్. ఈ సిరీస్‌లో మూడో భాగంగా రిలీజ్ అవుతున్న దబాంగ్ 3లో సుధీప్ విలన్‌గా నటించనున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన సుధీప్ పహిల్వాన్ టీజర్‌పై సల్మాన్ ప్రశంసల జల్లు కురిపించటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. బాలీవుడ్‌లో వాంటెడ్, రౌడీ రాథోడ్ లాంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన ప్రభుదేవా దబాంగ్ 3కి దర్శకత్వం వహించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment