![South Actor Sudeep Joins Salman Khan On Dabangg 3 Sets - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/6/salmankhan-5.jpg.webp?itok=VHO6cfsY)
సల్మాన్ ఖాన్, సుదీప్
బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, శాండల్‌వుడ్‌లో ‘కిచ్చ’ సుదీప్ టాప్ స్టార్స్. అదీ కాకుండా బాడీ ఫిట్‌గా ఉంచుకోవడంలో వాళ్లు చూపించే శ్రద్ధ ఎక్కువే. ఈ ఇద్దరూ ‘దబాంగ్ 3’ కోసం కలిశారు. సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో సుదీప్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సెట్లో ఇటీవల జాయిన్ అయ్యారు సుదీప్. ‘‘బయట భరించలేని ఎండ. అయినప్పటికీ మా సెట్లో ఉన్న ఎనర్జీని మ్యాచ్ చేయలేకపోతోంది. అద్భుతమైన సెట్, అద్భుతమైన మనుషుల మధ్య ఫస్ట్ డే షూట్ గడిచింది. సెట్లో జిమ్ ఉండటం బోనస్. థ్యాంక్యూ సల్మాన్ సార్. ఇంటి దగ్గరే ఉన్నట్టు మమ్మల్ని చూసుకుంటున్నందుకు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ‘దబాంగ్ 3’ ఈ ఏడాది డిసెంబర్ 20న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment