దబాంగ్‌ 3: అదిరిపోయిన ఫస్ట్‌లుక్‌ | Dabangg 3 Salman Khan Shares First Motion Poster Of His Film | Sakshi
Sakshi News home page

దబాంగ్‌ 3: అదిరిపోయిన సల్లూబాయ్‌ ఫస్ట్‌లుక్‌

Published Wed, Sep 11 2019 1:18 PM | Last Updated on Wed, Sep 11 2019 4:07 PM

Dabangg 3 Salman Khan Shares First Motion Poster Of His Film - Sakshi

దబాంగ్ సిరీస్‌తో చుల్‌బుల్‌పాండేగా అలరించిన కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ దబాంగ్‌ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ మోషన్‌ పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు. చుల్‌బుల్‌ పాండే గెటఫ్‌లో సల్మాన్‌ మరోసారి అదిరిపోయారు. పోస్టర్‌పై 'స్వాగతించారా' అనే క్యాప్షన్‌ హైలెట్‌గా నిలిచింది. ప్రభుదేవా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో సోనాక్షి సిన్హా కథానాయికగా నటిస్తున్నారు. దబాంగ్‌ మొదటి రెండు బాగాల్లో కనిపించిన అర్బాజ్‌ఖాన్‌, మహీగిల్‌ తమ పాత్రలను నిలుపుకోగా, కన్నడ సూపర్‌స్టార్‌ కిచ్చా సుదీప్‌ విలన్‌ పాత్ర పోషించనున్నాడు. కాగా డిసెంబర్‌ 20న దబాంగ్‌ 3 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా హిందీతో పాటు తమిళ్‌, తెలుగు, కన్నడ భాషల్లోనూ విడుదల కానుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement