
ఒకటి రెండేళ్లలో దబాంగ్-3
బాలీవుడ్లో సూపర్హిట్గా నిలిచిన దబాంగ్ సిరీస్లో మూడో సినిమా తీయడానికి కొంత సమయం పడుతుందని చెబుతున్నాడు.. దర్శకుడు అర్బాజ్ ఖాన్. దబాంగ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించి భారీ లాభాలు ఆర్జించడంతో దబాంగ్2 సినిమాకు స్వయంగా దర్శకత్వం కూడా వహించాడు. ఈ రెండు సినిమాల్లో హీరోగా చేసిన తన సోదరుడితోనే మూడో భాగం కూడా తీసేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు అర్బాజ్.
అయితే అందుకోసం సల్మాన్, తాను కూర్చుని చర్చించాల్సి ఉందని చెప్పాడు. దీనికి ఒకటి రెండేళ్లు పడుతుందన్నాడు. ఈసారి మాత్రం దర్శకత్వాన్ని వేరే ఎవరికైనా అప్పగించే అవకాశం ఉందని అర్బాజ్ చెప్పాడు. దబాంగ్ మొదటి పార్ట్ బ్రహ్మాండమైన హిట్ కాగా, దబాంగ్-2 మాత్రం ఘోరమైన డిజాస్టర్గా మిగిలింది. దాంతో తాను మెగాఫోన్ పట్టుకుంటే అంతగా వర్కవుట్ అవ్వదని అర్థం చేసుకున్న అర్బాజ్.. ఆ పనిని వేరే ఎవరైనా సమర్థులకు అప్పగించాలని నిర్ణయించుకున్నాడు.