పిల్లలు నుంచి పెద్దలు వరకు అంతా ఇష్టంగా తినే కూరగాయ ఏదంటే ఆలునే. ఎందుకంటే దీంతో చాలా రకాల రెసీపీలు, స్నాక్స్‌లు తయారు చేస్తారు. అందువల్ల ఇదంటే అందరికీ ఇష్టం. అయితే ఈ బంగాళ దుంప మన దేశానికి చెందింది మాత్రం కాదట. మరీ ఇది ఎక్కడ పుట్టింది? ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి తదితరాలు గురించి తెలుసుకుందామా..!
ఈ దుంప పుట్టింది దక్షిణమెరికాలో. ప్రపంచంలో మొత్తం నాలుగు వేల రకాల బంగాళాదుంపలు ఉన్నాయట. అవన్నీ విభిన్నమైన సైజుల్లో ఉంటాయట. బఠానీ గింజ పరిమాణం నుంచి యాపిల్ కాయంత వరకు చాలా రకాల సైజుల్లో ఉంటాయి. మనం సాధారణంగా పసుపుగా ఉండే దుంపల్నే చూశాం. కానీ ఇవి ఎరుపు, నీలం, నలుపు ఇలా బోలెడు రంగుల్లో ఉంటాయి.
క్రీస్తుపూర్వం 3000 కాలంలో దక్షిణమెరికాలోని పెరూ ప్రాంతంలో 'ఇంకా ఇండియన్లు' అనే జాతి ప్రజలే మొదటిసారి వీటిని పండించారని చెబుతారు. ఇప్పుడు ప్రపంచంలో మొక్కజొన్న, గోధుమ, బియ్యం తరవాత ఎక్కువ మంది బంగాళాదుంపనే తింటున్నారు. ఇది 1537లో యూరోప్ దేశాలకు చేరింది. మొదట ఆ దేశాల్లో దీనిని విషంలా చూసేవారు. జర్మనీ రాజు ఫ్రెడెరిక్ విలియం ఈ దుంపలోని సుగుణాల్ని తెలుసుకుని వీటిని పండించాల్సిందిగా ఆదేశించాడు. ఆ తర్వాత నంచే వీటివాడకం పెరిగింది.
బంగాళా దుంపలు 1621లో ఉత్తర అమెరికాకు, 1719లో ఇంగ్లాండుకు పరిచయం అయ్యాయి. బంగాళాదుంపలో 80 శాతం నీరే ఉంటుంది. అమెరికాలో ప్రతి ఏడాది బంగాళాదుంపతో చేసిన ఫ్రెంచ్‌ఫ్రైస్ 40 లక్షల టన్నులు అమ్ముడవుతాయట. ఒక అమెరికన్ ఏడాదికి 70 కిలోల దుంపల్ని తింటే, జర్మన్ 100 కిలోలు తింటాడని అంచనా. 1995లో కొలంబియా నౌకలో వీటిని అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. ప్రపంచంలో బంగాళాదుంపల్ని ఎక్కువ పండిస్తున్న దేశం చైనా. ఆ తరువాతి రెండు స్థానాల్లో రష్యా, ఇండియాలు ఉన్నాయి.
(చదవండి: తుమ్ము ఎంత పనిచేసింది? ఏకంగా ప్రేగులు..)
Comments
Please login to add a commentAdd a comment