మళ్లీ తడబడ్డ రాహుల్‌ | Rahul Gandhi's viral 'potato to gold' speech video | Sakshi
Sakshi News home page

మళ్లీ తడబడ్డ రాహుల్‌

Published Thu, Nov 16 2017 5:49 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Rahul Gandhi's viral 'potato to gold' speech video - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రసంగాల్లో పొరపాట్లు దొర్లడం సహజంగా మారింది. రాహుల్‌ ప్రసం‍గాల్లోని పొరపాట్లను ఆసరాగా చేసుకుని ఆయన ప్రత్యర్థులు సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు చేయడం సాధారణంగా మారింది. అదే సమయంలో ఆయన ప్రసంగాలను సోసల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుం‍డడంతో అవి మరింత వైరల్‌ అవుతున్నాయి. తాజాగా గుజరాత్‌ ఎన్నికల సందర్భంగా రాహుల్‌ ప్రసంగంలో దొర్లిన పొరపాటు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

గుజరాత్‌లో ఎన్నికల సభలో ప్రసం‍గించిన రాహుల్‌ గాం‍ధీ.. వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్‌ అవుతోంది. అహ్మదాబాద్‌లో సభలో ప్రసంగిస్తూ.. రాహుల్‌ గాంధీ ‘బంగాళ దుంపలను ఒక యంత్రంలో పెట్టగానే.. మరోవైపు బంగారం వచ్చేలా చేస్తానన్నారు. దీని వల్ల రైతులకు మేలు జరుగుతుంది’ అని అన్నారు. ఈ వీడియో పై నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు.

అయితే రాహుల్‌ గాంధీ వీడియోపై కాంగ్రెస్‌ నేతలు మాత్రం మండిపడుతున్నారు. రాహుల్‌ గాంధీ ప్రసంగంలో ముందు.. వెనుక వ్యాఖ్యానాలు తొలగించి.. కేవలం ప్రచారం కోసమే బీజేపీ నేతలు ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్‌ గాంధీ ఏ సందర్భంలో ఆలా అన్నారో.. పూర్తి వీడియో చూసి తెలుసుకోవాలని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement