ముఖం మీద మొటిమల మచ్చలు, గీతలు ఉంటే ఇబ్బంది పడతారు చాలా మంది. బ్యూటీ పార్లర్లకు వెళ్లి డబ్బు ఖర్చు చేస్తారు. అయితే, ఇంట్లోనే కొద్దిపాటి శ్రద్ధ తీసుకుంటూ ఈ చిట్కాలు పాటిస్తే మీ ముఖారవిందం మీకే కనువిందు చేస్తుంది.
తేనె, రోజ్ వాటర్ వేసి..
►రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిలో టీస్పూను తేనె, టీస్పూను రోజ్ వాటర్ వేసి చక్కగా కలపాలి.
►శుభ్రంగా కడిగి పొడిగా తుడిచిన ముఖానికి ఈ మిశ్రమాన్ని అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి.
►తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
►వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం మీద నల్లటి మచ్చలు, ట్యాన్ వల్ల ఏర్పడిన నలుపు పోతుంది.
►రోజ్ వాటర్ చర్మానికి సహజసిద్ధమైన మెరుపునిస్తే, తేనె చర్మానికి లోపలినుంచి తేమనందించి ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఇవి కూడా పాటిస్తే...
►ఒక టేబుల్ స్పూన్ తేనెలో టీ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాయాలి.
►ఇలా ప్రతిరోజూ చేస్తుంటే మూడు వారాలకు ఫలితం కనిపిస్తుంది.
►ముఖం మీదున్న నల్ల గీతలు, మచ్చలు తొలగిపోయి చంద్రబింబంలా మెరుస్తుంది.
బంగాళా దుంపతో..
►ఒక టేబుల్ స్పూన్ బంగాళదుంప తురుములో ఐదారు చుక్కల నిమ్మరసం, అంతే మోతాదులో తేనె కలిపి ముఖానికి పట్టించాలి.
►కొంచెం మంటగా ఉంటుంది. కాబట్టి ముఖమంతా పట్టించవద్దనుకుంటే మచ్చల మీద మాత్రమే రాయవచ్చు.
►ఇరవై నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి.
►అయితే పిగ్మెంటేషన్, సన్‌బర్న్ వంటి సమస్యలకు పై ప్యాక్‌ను ముఖమంతా వేస్తే మంచి ఫలితం ఉంటుంది.
వేపాకులతో..
►వేపాకులను పచ్చిగా కాని ఉడికించి కాని పేస్టు చేసి ముఖానికి రాస్తే మచ్చలు, గుల్లలు విస్తరించకుండా తగ్గిపోతాయి.
చదవండి: Anushka Sharma Beauty Secret: టీనేజ్‌లో ఉన్నపుడు అమ్మ చెప్పింది.. నా బ్యూటీ సీక్రెట్ అదే!
Smart Necklace: నెక్లెస్ ఉంటే ఆరోగ్యం పదిలం...
Comments
Please login to add a commentAdd a comment