బంగాళదుంపలంటే ఇష్టపడని వారుండరు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దలు వరకు అందరికి బంగాళదుపంతో చేసిన వంటకాలనే ఇష్టపడతారు. ఆ దుంపలతో వెరైటీ రెసీపీలను చేసుకుని మరీ ఆస్వాదిస్తారు చాలామంది. ఏదో ఒక కూరలో ఆ దుంపను యాడ్ చేయకుండా కొందరూ అస్సలు తినరు. అలాంటి బంగాళదుంపల కోసం ఓ రోజుని ఏర్పాటు చేసి మరి సెలబ్రేట్ చేస్తున్నారు. ఆ రోజంత బంగాళ దుంపలకు సంబంధించిన రెసీపీలు, స్నాక్స్‌తో రకరకాల వంటకాలతో విందులు, దానిలో ఉండే పోషక విలువలు ఆవశ్యకత చాటిచెప్పడం తదితరాలు నిర్వహిస్తారు. ఇంతకీ ఏ రోజు బంగాళదుంపల దినోత్సవం జరుపుకుంటారు. ఎప్పటి నుంచి ఇది మొదలైంది తదితర విషయాలు చూద్దాం!.
ఏరోజంటే..
ప్రతి ఏటా ఆగస్టు 19న జాతీయ బంగాళదుంపల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
చరిత్ర:
దక్షిణ పెరులో బొలీవియాలోని వాయువ్య ప్రాంతాలలో క్రీస్టూ పూర్వం 5 వేల నుంచి 8వేల మధ్య కాలంలో ఈ బంగాళ దుంపలను తొలిసారిగా పండిచారని విశ్వసిస్తారు. అప్పటి నుంచి ఈ కూరగాయ అనేక దేశాల వరకు విస్తరించిందని అంటున్నారు. ఆ కూరగాయే ఇప్పుడూ అందరూ ఆదరించే ఇష్టపడే వంటకంగా మారింది. దక్షణ అమెరికా నుంచి ఐరోపాకు విస్తరించడమేగాక తదనంతరం వివిధ దేశాల్లోని ప్రాంతాలకు విస్తరించింది.
పాన్‌కేక్‌ల నుంచి బ్రెడ్ రోల్స్ వరకు బంగాళ దుంపలు చాలా వంటలలో అగ్రస్థానంలో ఉంది. ఇందులో ఉండే పోషకాలు ఒక వ్యక్తికి నెలల తరబడి ఇతర ఆహార పదర్థాలపై ఆధారపడకుండా ఉండేలా శక్తిని ఇస్తుంది. ఎక్కడకి వెళ్లిన ఆహారంలో బంగాళ దుంపతో చేసిన ఏదో ఒక రెసీపి లేకుండా ఉండదు అంటే అతిశయోక్తి కాదేమో!. అంతలా ప్రజలన మనుసును దోచుకున్నా కూరగాయ బంగాళ దుంప. ఇప్పటికి దీంతో వెరైటీ వెరైటీ రెసీపీ చేస్తునే ఉంటారు పాకశాస్త్ర నిపుణులు.
(చదవండి: శనగపిండి మంచిదేనా?..వాటితో చేసే పిండి వంటకాలు తినొచ్చా!)
Comments
Please login to add a commentAdd a comment