Recipe: ఉత్తరాఖండ్‌ వంటకం ఆలుకీ  గుట్కే తయారీ ఇలా! | Recipes In Telugu: How To Make Aloo Ki Ghat Ki | Sakshi
Sakshi News home page

Recipe: ఉత్తరాఖండ్‌ వంటకం ఆలుకీ  గుట్కే తయారీ ఇలా!

Published Mon, Jun 27 2022 5:00 PM | Last Updated on Mon, Jun 27 2022 5:04 PM

Recipes In Telugu: How To Make Aloo Ki Ghat Ki - Sakshi

ఉత్తరాఖండ్‌ వంటకం ఆలుకీ  గుట్కే ఇలా తయారు చేసుకోండి.

ఆలుకీ  గుట్కే తయారీకి కావలసినవి:
►బంగాళ దుంపలు – మూడు
►ఆవనూనె – రెండు టీస్పూన్లు
►కారం – పావు టీస్పూను
►ధనియాలపొడి – రెండు టీస్పూన్లు
►జీలకర్ర – పావు టీస్పూను
►పసుపు – పావు టీస్పూను
►ఎండు మిర్చి – రెండు
►ఇంగువ – రెండు చిటికెలు
►ఉప్పు – రుచికి సరిపడా
►కొత్తిమీర తరుగు – గార్నిష్‌కు సరిపడా.

తయారీ...
►కొద్దిగా ఉప్పువేసి బంగాళ దుంపలను ఉడికించాలి
►∙ఉడికిన దుంపల తొక్క తీసి ముక్కలు తరగాలి
►చిన్న గిన్నెలో ధనియాల పొడి, కారం, పసుపు, రెండు టీస్పూన్ల నీళ్లుపోసి చక్కగా కలపాలి
►స్టవ్‌ మీద మందపాటి బాణలి పెట్టి నూనె వేయాలి. నూనె కాగాక జీలకర్ర, ఇంగువ, కారం వేసి అరనిమిషం పాటు వేయించాలి
►ఇప్పుడు బంగాళ దుంపల ముక్కలు, కలిపి పెట్టుకున్న మసాలా మిశ్రమం, రుచికి సరిపడా ఉప్పు  వేసి ఐదు నిమిషాలపాటు వేయించాలి.
►చివరిగా కొత్తిమీర చల్లుకుని దించేయాలి.
చదవండి: Jhangora Ki Kheer: వలు, ఊదలతో నోరూరించే రుచులు.. కొంచెం కారం, కొంచెం తీపి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement