ఈజీగా బరువు తగ్గేలా..ఈ ఓట్స్‌ లడ్డూ ట్రై చేయండిలా! | Weight Loss Oats Laddu Recipe | Sakshi
Sakshi News home page

ఈజీగా బరువు తగ్గేలా..ఈ ఓట్స్‌ లడ్డూ ట్రై చేయండిలా!

Published Sun, Oct 1 2023 4:41 PM | Last Updated on Sun, Oct 1 2023 6:03 PM

Weight Loss Oats Laddu Recipe  - Sakshi

ఓట్స్‌ లడ్డూకి కావలసినవి:  
ఓట్స్‌ – ఒక కప్పు (నేతిలో దోరగా వేయించి పెట్టుకోవాలి) 
వేరుశనగలు – అర కప్పు (దోరగా వేయించి 
కచ్చాపచ్చాగా పొడిలా మిక్సీ పట్టుకోవాలి.. పొట్టు తీసినా తీయకపోయినా పరవాలేదు) 
బెల్లం తురుము – ఒక కప్పు (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు) 
వేయించిన నువ్వులు – 2 టేబుల్‌ స్పూన్లు (అభిరుచిని బట్టి) 
నెయ్యి – సరిపడా
డ్రై ఫ్రూట్స్‌ ముక్కలు – కొన్ని (నేతిలో దోరగా వేయించి పెట్టుకోవాలి)

తయారీ విధానం: ముందుగా చిన్న మంట మీద బెల్లం పాకం పెట్టుకోవాలి. పాకం గమనించుకుని.. దగ్గర పడుతున్న సమయంలో, వేరుశనగల పొడి, నువ్వులు, డ్రై ఫ్రూట్స్‌ ముక్కలు, ఓట్స్, 1 టేబుల్‌ స్పూన్‌ నెయ్యి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. దగ్గర పడగానే స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని చల్లారనివ్వాలి. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకు నెయ్యి రాసుకుని ఉండల్లా చేసుకుంటే సరిపోతుంది. 

(చదవండి: ఎప్పుడైనా పెసలుతో పాలక్‌ ఇడ్లీ ట్రై చేశారా! ఆరోగ్యాని ఆరోగ్యం..రుచికి రుచి..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement