Best Oats Recipes: How To Prepare Oats Uthappa Recipe In Telugu - Sakshi
Sakshi News home page

Oats Uthappam Recipe: ఓట్స్‌ ఊతప్పం తయారీ విధానం ఇలా!

Published Fri, Jul 29 2022 1:14 PM | Last Updated on Fri, Jul 29 2022 1:34 PM

Recipes In Telugu: Healthy Breakfast Oats Uthappam Process - Sakshi

రోజూ తినే టిఫిన్లను కాస్త వెరైటీగా చేసుకుంటే కొత్త రుచిని ఆస్వాదించడంతోపాటు, శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. అందుకే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ ఓట్స్‌ ఊతప్పం రెసిపీ మీకోసం..

ఓట్స్‌ ఊతప్పం
కావలసినవి:
►ఓట్స్‌ – అరకప్పు
►బియ్యప్పిండి – పావు కప్పు
►పెరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు

►ఉప్పు – రుచికి సరిపడా
►ఉల్లిపాయ ముక్కలు – రెండు టేబుల్‌ స్పూన్లు
►క్యారట్‌ ముక్కలు – రెండు టేబుల్‌ స్పూన్లు
►టొమాటో తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు
►పచ్చిమిర్చి తరుగు. కొత్తిమీర తరుగు – రెండేసి టేబుల్‌ స్పూన్లు

తయారీ:
►ముందుగా ఓట్స్‌ను మిక్సీజార్‌లో వేసి పొడి చేసుకోవాలి
►ఓట్స్‌ పొడిలో ఉప్పు, పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి గరిటజారుగా కలుపుకోవాలి
►పాన్‌పై నూనె వేసి పిండిని మరీ పలుచగా కాకుండా, మందంగా కాకుండా మీడియం దోసెలా వేసుకోవాలి
►ఇప్పుడు క్యారట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, కొత్తిమీర తరుగుని ఒకగిన్నెలో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి
►ఊతప్పం ఒకవైపు కాలిన తరువాత క్యారట్‌ ముక్కల మిశ్రమాన్ని ఊతప్పం మొత్తం చల్లుకుని రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోవాలి.
►పిండిమొత్తాన్ని ఇదే విధంగా వేసుకుని ఏదైనా చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి.  

ఇవి కూడా ట్రై చేయండి: Capsicum Rings Recipe: రుచికరమైన క్యాప్సికమ్‌ రింగ్స్‌ తయారీ ఇలా!
Chicken Omelette Recipe: చికెన్‌ ఆమ్లెట్‌ తయారీ విధానం ఇలా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement