soft
-
Moon Sniper: జపాన్ ల్యాండరుకు శ్రద్ధాంజలి
అవరోహణలో అదుపు తప్పి వేగంగా కిందికి దూసుకెళ్లలేదు. పట్టు తప్పి ధడేల్మని పడిపోలేదు. కూలిపోలేదు... ధ్వంసమవలేదు. చంద్రుడి ఉపరితలంపై దిగడానికైతే సాఫీగానే దిగింది ‘స్లిమ్’ ల్యాండర్. కానీ... తూలిపోయింది! తన ఐదు కాళ్లపై తాను సొంతంగా నిలబడలేకపోయింది. స్వతంత్రంగా నిలదొక్కుకోలేకపోయింది. షియోలీ బిలం వాలులో కిందికి దిగగానే దొర్లి తల కిందికి పెట్టి కాళ్లు పైకెత్తింది. శీర్షాసనం భంగిమలో ఉండిపోయింది. ‘మూన్ స్నైపర్’ దిగీ దిగగానే నెమ్మదిగా పూవు రెక్కల్లా విచ్చుకుని ఆకాశంలోని సూర్యుడిని చూస్తూ కరెంటు తయారుచేసి శక్తినివ్వాల్సిన ల్యాండర్ పై భాగంలోని సౌరఫలకాలు (సోలార్ ప్యానెల్స్).. ల్యాండర్ తలకిందులవటంతో జాబిలి నేలవైపు ఉండిపోయాయ్. సౌరశక్తి అందే మార్గం మూసుకుపోయింది. ఇక.. ‘స్లిమ్’ ల్యాండరులోని ఆన్‌బోర్డ్ (ఇన్ బిల్ట్) బ్యాటరీ కొన్ని గంటలు పనిచేసి ఈపాటికి ‘డెడ్’ అయివుంటుంది. ‘మూన్ స్నైపర్’ తనంతట తాను పైకి లేచి నిటారుగా నిలబడే ఏర్పాటు, అవకాశం లేవు. అంటే... పవర్ కోల్పోయిన ల్యాండర్ ఈసరికే మూగబోయి శాశ్వత నిద్రలోకి జారుకుని వుంటుంది. మిషన్ కథ ఇక ఇక్కడితో పరిసమాప్తం. జపాన్ సాధించింది పరిపూర్ణ విజయమా? పాక్షిక విజయమా? కనీస విజయమా? అని ప్రశ్న వేసుకుంటే... అది తన ప్రయత్నంలో విఫలం మాత్రం కాలేదనే చెప్పాలి. తమ ‘స్లిమ్’ వ్యోమనౌక అధ్యాయం ముగిసిందనే వార్తను జపాన్ అంతరిక్ష సంస్థ ఈ రోజు కాకపోతే రేపైనా, కొంచెం ఆలస్యంగానైనా అటు స్వదేశంలోనూ, ఇటు బాహ్య ప్రపంచానికి అధికారికంగా ప్రకటించాల్సివుంటుంది. సరిగ్గా తన ల్యాండింగ్ సమయంలో చంద్రుడి మీదికి ‘మూన్ స్నైపర్’ జారవిడిచిన రెండు (LEV-1 & 2) లూనార్ ఎక్స్కర్షన్ వెహికల్స్... భూమికి ఏం సమాచారం ప్రసారం చేశాయో పరిశీలించాల్సివుంది. దిగేటప్పుడు ల్యాండరును ఈ జంట రోవర్లు తీసిన చిత్రాలు, వీడియో వెల్లడికావలసివుంది. జంట రోవర్లు పంపిన డేటాను ప్రాసెస్ చేశాక ‘జాక్సా’ ఏం చెబుతుందో వేచిచూద్దాం. -జమ్ముల శ్రీకాంత్ చదవండి: అతిపెద్ద గొయ్యి.. ఇక్కడ తవ్వే కొద్ది వజ్రాలు! -
పదిలం పసి కుసుమం
చలికాలంలో చర్మం పొడిబారుతుంది. అతి కోమలంగా ఉండే శిశువుల చర్మమైతే ఇక చెప్పేదేముంది? అందుకే చలికాలమంతా శిశువుల చర్మం మృదువుగా, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ సీజన్లో చలిగాలులు వీస్తుంటాయి. గాలిలోని తేమ తగ్గిపోతుంటుంది. పర్యవసానమే చర్మం పొడిబారడం.. పొట్టు రాలడం... దురదపెట్టడం. కందిపోవడం. శిశువుల విషయంలో ఇలా జరక్కుండా ఉండాలంటే వారి చర్మ సంరక్షణకు సంబంధించి కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. చలికాలంలోనూ వేడి పొక్కులు! వేడిపొక్కులు, గుల్లలు వేసవిలో మాత్రమే వస్తాయనుకుంటాం. అది తప్పు. శిశువులను చలి నుంచి కాపాడేందుకు వారికి తొడిగే మందపాటి వస్త్రాల వల్ల కూడా ఉక్కబోసి, ఊపిరాడనట్లై వారి చర్మం మీద గుల్లలు, దద్దుర్లు ఏర్పడుతుంటాయి. అందుకే ఒంటికి గాలి తగిలేలా తేలికపాటి దుస్తులను వేయాలి. కాటన్ దుస్తులకు చెమటను పీల్చుకునే గుణం ఉంటుంది. కాబట్టి శిశువులకు మొదట కాటన్ దుస్తులను వేసి, చలి తీవ్రతను బట్టి పైన ఉన్ని వస్త్రాలను కప్పాలి. అయితే అవి కూడా తేలికపాటివై ఉండాలి. నులివెచ్చని నీటి స్నానం పెద్ద వాళ్లతో పోల్చి చూసినప్పుడు శిశువుల చర్మం శీతాకాలంలో త్వరగా నిర్జలీకర ణ చెందుతుంది. ఆ పరిస్థితి నివారించేందుకు వేణ్ణీళ్లతో లేదా చన్నీళ్లతో కాకుండా నులివెచ్చటి నీటితో వారికి స్నానం చేయించాలి. అప్పుడు చర్మం సమస్థితిలో ఉంటుంది. అలాగే బేబీ ప్రాడక్ట్ విషయంలోనూ జాగ్రత్త వహించాలి. గాఢమైన చర్మ సంరక్షణ ఉత్పత్తులు శిశువు శరీరంపై ఉండే సహజసిద్ధమైన నూనెలను హరించివేస్తాయి. దీని వల్ల చర్మం బిరుసెక్కి దురద పెడుతుంది. స్నానం చేయించాక శిశువు ఒంటి పై తడిని మెత్తటి పొడి టవల్‌తో అద్దినట్లుగా తుడవాలి. ఆ తర్వాత తే లికపాటి హెర్బల్ బేబీ లోషన్‌ను సుతిమెత్తగా, చర్మం లోనికి పీల్చుకునేలా ఒంటికి పట్టించాలి. అలా చలికాలమంతా ఆరు గంటలకోసారి చర్మానికి లోషన్ రాస్తుంటే మృదువుగా ఉంటుంది. సుతిమెత్తగా మర్దనా చలికాలంలో శిశువుకు మృదువుగా మర్దనా చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. మర్దనా వల్ల రక్త ప్రసరణ క్రీయాశీలమై శరీరానికి వెచ్చదనం చేకూరుతుంది. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల చర్మం తేమగా, మృదువుగా ఉండి, పొట్టు రాలే సమస్య ఉత్పన్నం కాదు. అయితే వాతావరణం సమస్థితిలో ఉండే మధ్యాహ్నం వేళల్లో మాత్రమే శిశువుకు మర్దనా చేయాలి. అలాగే ఆహారం తినిపించాక మర్దనా చేయకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఏడు మాలికా వైద్య పరిష్కారాలు ఆలివ్ ఆయిల్: ఇందులో ఇ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. శిశు చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచే ఉపశమనాలు, క్రిమినిరోధకాలు ఇందులో ఉన్నాయి. ఆల్మండ్ ఆయిల్: శిశువు చర్మానికి తేమను అందిస్తుంది. కంట్రీ మాలో: ఇది యాంటీ ఆక్సిడెంటు. ఇందులో పోషకాలు ఉన్నాయి. శిశువు చర్మాన్ని క్రిముల నుండి కాపాడుతుంది. లికోరైస్: దురద, వాపు. దద్దుర్లకు ఇది చక్కటి లేపనం. ఫెనూగ్రీక్: తిరుగులేని మాయిశ్చరైజర్. ప్రత్యేకించి శిశువు పొడిచర్మానికి తేమను అందించడానికి ఉద్దేశించినది. గ్రీన్‌గ్రామ్: శిశువు చర్మాన్ని సమశీతోష్ణంగా ఉంచుతుంది. అలోవెరా: గాయాలు, కాలిన గాయాలు, చర్మ వ్యాధులకు ఇది చక్కటి ఆయుర్వేద ఔషధం. చర్మానికి తేమను అందిస్తుంది. బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పని చేస్తుంది. కాటన్ దుస్తులకు చెమటను పీల్చుకునే గుణం ఉంటుంది. కాబట్టి శిశువులకు మొదట కాటన్ దుస్తులను వేసి, చలి తీవ్రతను బట్టి పైన ఉన్ని వస్త్రాలను కప్పాలి. అయితే అవి కూడా తేలికపాటివై ఉండాలి. -
‘సాఫ్ట్’గా ప్రచారం.. ముంచుకొస్తున్న ముప్పు..
అమీర్‌పేటలో శిక్షణ సంస్థల ప్రచార హోరు వీధులు కనబడకుండా బ్యానర్లు మురుగు ప్రవాహానికి అడ్డుగా కరపత్రాలు సనత్‌నగర్, న్యూస్‌లైన్: అమీర్‌పేటలో ‘సాఫ్ట్’ ప్రచారం హడలెత్తిస్తోంది. కరప్రతాలు రోడ్లను సైతం కనిపించకుండా చేసేస్తుంటే.. బ్యానర్లు వీధులను ముంచేస్తున్నాయి. చిన్న చోటు కనిపిస్తే ప్రచార కోసం సాఫ్ట్వేర్ శిక్షణ కేంద్రాలు వాలిపోతున్నాయి. అమీర్‌పేట్ మైత్రీవనమ్ నుంచి సత్యం థియేటర్ రోడ్డు, మైత్రీవనమ్ వెనుక ప్రాంత రహదారులను ఒక్కసారి పర్యటిస్తే ఏ వీధిలో ఉన్నామో తెలియని అయోమయంగా ఉంటుంది. రోడ్లను అపరిశుభ్రంగా మార్చడంతో పాటు వీధులను కానరాకుండా చేస్తున్న సాఫ్ట్వేర్ శిక్షణ సంస్థల ప్రచార అస్త్రాలపై అధికారులు సైతం ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో సమస్య మరింత జఠిలమవుతోంది. మురుగు పారుదలను అడ్డుకునేలా.. అమీర్‌పేట, ఎస్ఆర్నగర్ ప్రాంతాల్లో దాదాపు మూడు వేలకు పైగా సాఫ్ట్వేర్ శిక్షణ సంస్థలు ఉండగా దాదాపు రెండు లక్షల మంది విద్యార్ధులు శిక్షణ పొందుతున్నారు. ప్రతిరోజు కొత్తగా వచ్చేవారు వేలల్లో ఉంటారు. వీరిని ఆకర్షించేందుకు ఆయా శిక్షణ సంస్థలు పోటీపడుతుంటాయి. ఈ క్రమంలో కోర్సుల వివరాలతో ముద్రించిన వేలాది కరప్రతాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఎవరికి నచ్చిన రీతిలో వారు చేస్తుంటారు. ఒక్క కరపత్రాలనే గమనిస్తే ఉదయం, సాయంత్రం వేళల్లో దాదాపు వంద మంది వరకు కేవలం పంచడానికే విధులు నిర్వర్తిస్తారు. ఈ కరపత్రాలను అక్కడికక్కడే పడేస్తుంటారు. ఇలా రోజుకు ఐదు క్వింటాళ్ల కరపత్రాలే ఇక్కడ నుంచి పారిశుద్ధ్య సిబ్బంది సేకరిస్తున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే, వర్షానికి, గాలికి కాగితాలన్నీ మురుగనీటి మ్యాన్హోల్ల్లోకి చేరి మురుగు ప్రవాహానికి అడ్డుపడుతున్నాయి. దీంతో రోడ్డుపైకి మురుగు పొంగుకు రావడం నిత్యకృత్యంగా మారింది. ఇదిలా ఉంటే స్తంభాలకు అడ్డదిడ్డంగా కడుతున్న బ్యానర్లు వాహనదారులకు అసౌకర్యంగా మారుతున్నాయి. కమిషనర్ ఆదేశాలూ బేఖాతర్.. ఇక్కడి పరిస్థితిపై గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న కృష్ణబాబు స్వయంగా పరిశీలించి సాఫ్ట్వేర్ సంస్థల ప్రచారతీరుపై మండిపడ్డారు. వీటి ప్రచార నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అప్పట్లో ఆయన ఆదేశాల మేరకు జోనల్ కమిషనర్ పర్యటించి బ్యానర్లు, బోర్డుల తొలగింపునకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో రెండు మూడు రోజులు బోర్డులను, బ్యానర్ల తొలగించిన సిబ్బంది ఆ తరువాత పట్టించుకోలేదు. దీంతో సమస్య యధాస్థితికి వచ్చింది. సాఫ్ట్వేర్ సంస్థలు ప్రచారం చేసుకోవడానికి కింది స్థాయి సిబ్బందికి, నేతల చేతులు తడుపుతుండడం వల్లే వాటిని అడ్డుకోవడం లేదనే విమర్శలూ తలెత్తుతున్నాయి. సాధారణంగా ఏదైనా బోర్డు, బ్యానర్ల ఏర్పాటుకు అధికారుల అనుమతి తప్పనిసరి. ఇదంతా ఎందుకనుకుని శిక్షణ సంస్థలు కిందిస్థాయి సిబ్బందిని, నేతలను ప్రసన్నం చేసుకుంటున్నారని సమాచారం. దీంతో జీహెచ్ఎంసీ ఆదాయానికి సైతం గండిపడుతుండడంతో పాటు నీటిపారుదలకు అడ్డంకి సృష్టించేలా కరపత్రాలు కొట్టుకురావడంతో ముంపు సమస్య ఎదురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.