Samantha Workout Interrupted by Her Pets Hash and Sasha, Video Viral - Sakshi
Sakshi News home page

Samantha : సమస్యలు వస్తాయని తెలుసు.. సమంత పోస్ట్‌ వైరల్‌

Published Fri, Mar 4 2022 6:15 PM | Last Updated on Fri, Mar 4 2022 10:11 PM

Watch Samantha Workout Interrupted By Her Pets Hash And Sasha - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సినిమాలు, పర్సనల్‌ లైఫ్‌, ఫిట్‌నెస్‌ సహా పలు విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇ‍క వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంది. సమంత ఫిట్‌నెస్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో ఎంతగా వైరల్‌ అవుతాయా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్‌ చేసుకుంది. అందులో సామ్‌ వర్కవుట్స్‌ చేస్తుంటే, తన పెట్స్‌ హాష్‌, సాషాలు గొడవ పడుతుంటాయి. దీనికి సంబంధించిన వీడియోను షేర్‌ చేస్తూ.. జీవితంలో సిబ్లింగ్స్‌ మధ్య సమస్యలు వస్తుంటాయని నాకు తెలుసు అంటూ ట్యాగ్‌లైన్‌ ఇచ్చింది. అయితే గొడవ పడ్డా మళ్లీ ఒక్క నిమిషంలోనే అవి కలిసిపోయాయంటూ ఫోటోలను షేర్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement