Ram Pothineni Injured: While Doing Workouts In Gym, Photos Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Ram Pothineni: హీరో రామ్‌కు గాయాలు.. షూటింగ్‌కు బ్రేక్‌

Published Mon, Oct 4 2021 12:19 PM | Last Updated on Mon, Oct 4 2021 1:26 PM

Hero Ram Pothineni Got Injured While Doing Workouts In Gym - Sakshi

Ram Pothineni Got Injured : హీరో రామ్‌ పోతినేని గాయాలపాలయ్యారు. జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తుండగా ఆయన మెడకు గాయమైంది. ఈ విషయాన్ని స్వయంగా రామ్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. తనకు అయిన గాయాన్ని చూపిస్తూ ఫోటోను షేర్‌ చేశాడు. దీంతో 'రామ్‌ త్వరగా కోలుకోవాలి..గెట్‌ వెల్‌ సూన్‌' అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రామ్‌ లింగుస్వామి దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కోసం రామ్‌ జిమ్‌లో వ్యాయామం చేస్తూ గాయాలపాలయ్యారు. RAPO19గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. రామ్‌కి గాయం కావడంతో ప్రస్తుతం షూటింగ్‌కి బ్రేక్‌ ఇచ్చినట్లు తెలుస్తుంది. కృతిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement