
ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యం ఇస్తారు సమంత. వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారీ బ్యూటీ. తాజాగా వర్కౌట్స్ గురించి సమంత మాట్లాడుతూ – ‘‘రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు రోజులో ఓ గంట సమయాన్ని వ్యాయామం కోసం కేటాయించాలి. ఉదయాన్నే వ్యాయామం లేదా యోగాతో రీచార్జ్ అయితే రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది. అందుకే తప్పకుండా వ్యాయామం చేయండి. మంచి శరీరాకృతి, అందం కోసమే నేను వర్కౌట్స్ చేయాలనుకోను. వర్కౌట్స్ చేసిన తర్వాత వచ్చే మంచి ఫీల్, నాలో వచ్చే కొత్త ఉత్సాహం కోసం చేస్తుంటాను’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment