
రోజు వర్క్‌అవుట్స్ చేద్దామనుకొని మీరు చేయలేకపోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. భారత క్రికెటర్ రోహిత్ శర్మ తన భార్య రితికా సజ్దేతో కలిసి వర్క్‌అవుట్స్ చేస్తున్న ఒక వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై రోహిత్ శర్మ సహచరుడు యజువేంద్రచహల్ కూడా ఫన్నీగా స్పందించారు. సోషల్ మీడియలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రోహిత్ శర్మ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
మొన్న దుబాయ్ వెళుతున్న సమయంలో తన కూతురు వస్తువులు ప్యాక్ చేయడంలో సాయం చేస్తున్న వీడియోను షేర్ చేసిన రోహిత్ తాజాగా తన భార్యతో కలిసి వర్క్‌అవుట్స్ చేస్తున్న వీడియోను పంచుకున్నారు. దీనికి కలిసి ‘శక్తిమంతమవుదాం’ అనే క్యాప్షన్‌కి తోడు దానికి ఒక బ్లూకలర్ ఎమోజీని జోడించాడు. దీనిపై ఆయన అభిమానులు స్పందిస్తున్నారు. కపుల్ గోల్స్ యట్ పీక్స్ అంటూ కొందరు కామెంట్ చేశారు. యజువేంద్ర చహల్ మాత్రం ఈ వీడియోపై చాలా ఫన్నీగా స్పందించారు. ఏంటి వదిన, భయ్యా నీతో కలిసి ఐపీఎల్ ఓపెనింగ్ ఆడుతున్నాడా? అని కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment