82వ వ‌సంతంలోకి ఉషా సోమ‌న్ | Milind Somans Mom Usha Soman Celebrated 81st Birthday | Sakshi
Sakshi News home page

82వ వ‌సంతంలోకి ఉషా సోమ‌న్

Jul 6 2020 2:56 PM | Updated on Jul 6 2020 3:24 PM

Milind Somans Mom Usha Soman Celebrated 81st Birthday - Sakshi

న్యూఢిల్లీ :  పుష్-అప్స్, లాంగ్‌ర‌న్స్‌తో   ఫిట్‌నెస్‌లో త‌న‌కు తానే  సాటిగా నిరూపించుకున్న ఉషా సోమ‌న్ 82వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు.  బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఒకేసారి ఏక‌ధాటిగా 15 పుష్అప్స్ చేసి మ‌రోసారి త‌న మార్క్ చూపించుకున్నారు.  దీనికి సంబంధించిన వీడియాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. బామ్మ‌గారి ఫిట్‌నెస్‌కి ఎంతోమంది సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ఫ్యాన్స్ ఉన్నారు. ఫిట్‌నేస్‌ ప్రియులకు గట్టి పోటినిస్తూ సవాలు విసురుతున్న ఉషా సోమ‌న్.. మన టాప్‌ ఇండియన్‌ మోడల్‌ మిలింద్‌ సోమన్ తల్లి. . గ‌తంలోనూ మిలింద్‌ భార్య అంకితా కొన్వర్‌తో కలిసి ఆమె ఒంటి కాలితో బాక్స్‌ జంప్స్‌ చేయడమే కాకుండా కొడుకుతో సమానంగా పుష్‌-అప్స్‌, వర్కఅవుట్స్‌ చేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే.

అంతేకాదు ఉష సోమన్‌ తన కొడుకు మిలింద్‌తో కలిసి చీరలో పుష్‌-అప్‌లు చేస్తున్న వీడియో కూడా ఫిట్‌నెస్ ప్రియుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇటీవల ఉష, తన కొడుకు మలింద్‌కు పోటీగా ఒకేసారి 16 పుష్‌-అప్‌లు చేసిన వీడియోను ఉమెన్స్‌ డే సందర్భంగా షేర్‌ చేశాడు. అలాగే 2016లో మహరాష్ట్రలోని నిర్వహించిన ఓ మరథాన్‌లో మలింద్‌తో పాటు ఆయన తల్లి ఉష కూడా పాల్గొన్న వీడియో మదర్స్‌ డే సందర్భంగా పంచుకున్నాడు. ఇలా వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యవంతమైన ఫిట్‌నెస్‌తో యువతతో పాటు వృద్ధులకు కూడా సవాలుగా నిలిచిన తన తల్లి ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను తరచూ మలింద్‌ సోషల్‌ మీడియాలో పంచుకంటుంటాడు. (వైరల్‌: సినిమాను తలపించే పోలిస్‌ ఛేజింగ్‌! )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement