యంగ్‌ హీరోలకు ధీటుగా మాధవన్‌.. ఫిట్‌నెస్‌ రహస్యం ఇదే! | What Workout And Diet Plans Does Madhavan Follow | Sakshi
Sakshi News home page

ఐదుపదుల వయసులోనూ ఫిట్‌గా ఉండే మాధవన్‌.. నాన్‌వెజ్‌ లాగిస్తాడట!

Published Fri, Apr 5 2024 4:50 PM | Last Updated on Fri, Apr 5 2024 6:25 PM

What Workout And Diet Plans Does Madhavan Follow - Sakshi

కోలీవుడ్‌ నటుడు రంగనాథ్‌ మాదవన్‌ తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించి, విమర్శకుల ప్రశంసలందకున్నారు. మాధవన్‌ తన అభినయ నటనకుగానూ రెండు ఫిలింఫేర్‌ పురస్కరాలు అందుకున్నాడు. దాదాపు ఏడు భాషల్లో నటించారు. ఆయన రచయిత కూడా. మాధవన్‌ సినీ ప్రయాణం టీవీ సీరియల్‌ నుంచి మొదలై అలా 2000లో వచ్చిన 'అలై పాయుదే; అదే తెలుగులో 'చెలి'(2001) మూవీ నుంచి వెనుతిరిగి చూడకుండా విజయపథంలోకి దూసుకుపోయారు.

ఐదు పదుల వయసుకు చేరువైన మాధవన్‌ ఇప్పటికీ యువ హీరోలకు ధీటుగా మంచి స్మార్ట్‌ లుక్‌లో కనిపిస్తారు. అంతలా గ్లామరస్‌గా కనిపించడానికి మాధవన్‌ ఫాలో అయ్యే డైట్‌, ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఏంటో తెలుసుకుందామా!

వర్కౌట్‌లు..

  • మాదవన్‌ ఫిట్‌నెస్‌కి పెట్టింది పేరు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తాడు. చక్కటి బాడీ మెయింటెయిన్‌ చేసేందుకు కఠిన వర్కౌట్‌లు డైలీ లైఫ్‌లో భాగం. దాదాపు 30 నిమిషాల పాటు కార్డియో సెషన్‌ ప్రారంభిస్తాడు. ముఖ్యంగా రన్నింగ్‌, సైక్లింగ్‌, ఎలిప్టికల్‌ మెషీన్‌ వంటివి ఉంటాయి.  
  • ఆయన స్క్వాట్‌లు, డెడ్‌లిఫ్ట్‌లు, పుల్‌ అప్స్‌లు తప్పనిసరిగా చేస్తాడు. అవి అతని హృదయ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. అంతేగాదు ప్రతి వ్యాయామాన్ని కనీసం మూడు నుంచి నాలుగు సెట్‌ల వారీగా ప్రతిసెట్‌లో కనీసం ఎనిమిది నుంచి 12 కసరత్తుల చొప్పున చేస్తారు. 
  • అలాగే ఒత్తడిని దూరం చేసుకునేలా ధ్యానం వంటివి చేస్తారు 
  • సముతుల్య ఆహారం, పోషకాలతో కూడిన ఆహారాలను డైట్‌లో ఉండేలా చూసకుంటారు. కానీ తినాలనుకున్నది మాత్రం కడుపు నిండుగా తింటాని చెబుతున్నాడు మాధవన్‌. అయితే అందుకు తగ్గట్టుగానే కసరత్తులు కూడా చేస్తానని అంటున్నాడు. 

డైట్‌..

  • చికెన్‌, చేపలు, కాయధాన్యాలు, ప్రోటీన్‌ రిచ్‌ ఫుడ్స్‌ తీసుకుంటారు. 
  • శక్తినిచ్చేలా బ్రౌన్‌ రైస్‌, క్వినోవా, చిలగడదుంప, తదితరాలను తీసుకుంటారు. 
  • అలాగే ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయాలు ఉండేలా చూసుకుంటారు. పైగా శరీరానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అందేలా జాగ్రత్త పడతారు. తన వ్యక్తిగత ఫిట్‌నెస్‌ నిపుణుడు సాయంతోనే మంచి డైట్‌ ఫాలో అవుతారు మాధవన్‌.

(చదవండి: కట్టెల పొయ్యి, బొగ్గుల మీద చేసిన వంటకాలు తినకూడదా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement