ముంబై: ప్రముఖ బజాజ్ ఫిన్‌సర్వ్ లిమిటెడ్ షేర్లు తొలిసారిగా రూ.3 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువను దాటాయి. నేడు కూడా స్టాక్ మార్కెట్ భారీగా లాభాలు పొందడంతో ఈ మైలురాయిని సాధించిన దేశంలో 18వ సంస్థగా నిలిచింది. ఇంట్రాడే స్టాక్ బిఎస్ఈలో ₹19,107.45 తాజా రికార్డు గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 1.04% పెరిగి 61,943.84 పాయింట్లకు చేరుకుంది. ఈ అక్టోబర్ నెలలో ఇప్పటి వరకు బజాజ్ ఫిన్‌సర్వ్ స్టాక్ 7.41% లాభపడతే, ఏడాది నుంచి ఇప్పటి వరకు 114% పెరిగింది.
ఇంతకు ముందు వరకు ఆర్ఐఎల్, టీసీఎస్, హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ లిమిటెడ్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌డిఎఫ్‌సీ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐటీసీ లిమిటెడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతి ఎయిర్ టెల్, ఒఎన్ జిసి, విప్రో, హెచ్ సీఎల్ టెక్నాలజీస్ ఈ మైలురాయిని సాధించాయి. కరోనా మహమ్మారి వల్ల కొద్దిగా ఒడిదుడుకులు ఎదరైనా వృద్ధికి బాగా దోహదపడే అనేక చర్యలు తీసుకుంది. ఇటీవలే బజాజ్ ఫిన్‌సర్వ్ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్)ను స్పాన్సర్ కోసం సెబీ నుండి సూత్రప్రాయ ఆమోదం పొందింది.(చదవండి: కష్టాల్లో ఉన్నాం కాపాడమంటూ భారత్‌ను కోరిన శ్రీలంక!)
Comments
Please login to add a commentAdd a comment