బ్యాంకుల్లో దీపావళి సందడి మొదలైంది. దీపావళి సందర్భంగా ఇప్పటికే ఈ-కామర్స్ దిగ్గజాలు వినియోగదారులకు ఆఫర్లు ప్రకటించగా.. తాజాగా బ్యాంకులు సైతం హోంలోన్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్‌లపై ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ దీపావళి సందర్భంగా ప్రీమియం స్మార్ట్ ఫోన్‌లతో పాటు ఇతర వస్తువులపై నోకాస్ట్ ఈఎంఐ, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించింది. అమెజాన్‌లో ఏదైనా ప్రొడక్ట్‌ను హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే కష్టమర్లకు 22.5 శాతం వరకు క్యాష్ బ్యాక్, నోకాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తుంది. దీంతో పాటు కారు లోన్‌ను 7.50శాతం, పర్సనల్ లోన్ 10.25శాతం, టూవీలర్ పై 4 శాతం కన్నా తక్కువ వడ్డీకి అందిస్తుంది.
ఎస్‌బీఐ
ఈ దివాళీకి ఎస్‌బీఐ సైతం బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ఇప్పటికే హోం లోన్‌పై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా 6.7 శాతం వడ్డికే అందిస్తుంది. దీంతో పాటు కారు లోన్ పై పడే ఇంట్రస్ట్‌లో 0.5 శాతం వరకు రాయితీ, ప్రాసెసింగ్ ఫీజు రద్దు చేస్తుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లలో ప్రొడక్ట్‌ల కొనుగోలుపై రూ.2500 వరకు క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు.
యాక్సిస్ బ్యాంక్
దివాళీ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్ లోకల్ కస్టమర్లను టార్గెట్ చేసింది. ఇందులో భాగంగా 50నగరాల్లో 2500పైగా లోకల్ స్టోర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. లోకల్ స్టోర్‌లలో యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేసిన కష్టమర్లకు 20 డిస్కౌంట్‌ను అందిస్తుంది. దీంతో పాటు ఈకామర్స్ సైట్లలో ప్రొడక్ట్‌ల కొనుగోలుపై మరో 10శాతం డిస్కౌంట్ లభించనుంది. హోంలోన్లపై యాక్సిస్ బ్యాంకు 12 ఈఎంఐలను రద్దు చేసింది. టూవీలర్ల కొనుగోలు పై ప్రాసెసింగ్ ఫీజును తీసేసింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫర్లు ఇవ్వడంలో ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐతో పోటీ పడుతుంది.గతంలో హోం లోన్‌పై వడ్డీ 6.85, వాహనాల రుణాలపై 7.35శాతం ఇంట్రస్ట్ ఉండేది. కానీ దివాళీని పురస్కరించుకొని బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించింది. గృహరుణాలపై వడ్డీ 6.50శాతం, వాహన రుణాలపై 6.85 శాతంకే అందిస్తుంది.
ఐసీఐసీఐ
ఐసీఐసీఐ బ్యాంక్ సైతం దివాళీ సందర్భంగా 'ఫెస్టివ్ బొనాంజా' ఆఫర్లను ప్రటించింది. ఈ కామర్స్‌తో పాటు ఇతర ఫ్లాట్‌ఫాంలలో ప్రతి ప్రొడక్ట్ కొనుగోలుపై డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా ఈ కామర్స్ సైట్లలో కొనుగోలు చేస్తే 20 శాతం క్యాష్ బ్యాక్‌తో పాటు డిస్కౌంట్‌ను పొందవచ్చు. హోంలోన్, ఫోర్ వీలర్ వంటి లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా
బరోడా బ్యాంకు ఇంటి రుణాలపై వడ్డీ రేటును తగ్గించింది. ఇంతకు ముందు 7శాతంగా ఉన్న వడ్డీ రేటును 6.5 శాతానికి తగ్గించింది. ఇంటి,వాహన రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment