ప్రభుత్వం రైల్వే కార్మికులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుంటే, ఆందోళన తప్పదని నేషనల్ ఫెడరేష¯ŒS ఆఫ్ ఇండియ¯ŒS రైల్వేమె¯ŒS ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం.రాఘవయ్య హెచ్చరించారు. గురువారం రైల్వే కల్యాణమండపంలో జరిగిన విలేకరుల
-
లేకుంటే ఆందోళన తప్పదు ∙
-
ఎ¯ŒSఎఫ్‌ఐఆర్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం.రాఘవయ్య
దేవీచౌక్ (రాజమహేంద్రవరం) :
ప్రభుత్వం రైల్వే కార్మికులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుంటే, ఆందోళన తప్పదని నేషనల్ ఫెడరేష¯ŒS ఆఫ్ ఇండియ¯ŒS రైల్వేమె¯ŒS ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం.రాఘవయ్య హెచ్చరించారు. గురువారం రైల్వే కల్యాణమండపంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 7వ పే కమిష¯ŒS సిఫార్సులు లోపభూయిష్టమైనవని, సుమారు 13 లక్షల రైల్వే ఉద్యోగులు, కార్మికుల ఆశలపై సిఫార్సులు నీళ్లు చల్లాయన్నారు. ఈ ఏడాది జూ¯ŒS 16న ప్రభుత్వానికి సమ్మె నోటీసు జారీ చేశామని, ఆ నెల 30న కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చర్చలకు తమను ఆహ్వానించి సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని, కనీస వేతనాల పెంపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని రాఘవయ్య తెలిపారు. అనంతరం ప్రభుత్వం మాట నిలబెట్టుకోకుండా హామీలను గాలికి వదిలేసిందని, ఈ అంశాలను వివరిస్తూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసినా ఫలితం శూన్యమని రాఘవయ్య అన్నారు. మేక్ ఇ¯ŒS ఇండియా నినాదం చేస్తున్నప్పటికీ స్పెయి¯ŒS నుంచి రైళ్లు తీసుకువస్తున్నారని రాఘవయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త రైల్వేలైన్లు వేస్తున్నప్పటికీ తగిన సిబ్బందిని నియమించడం లేదన్నారు. రైల్వేశాఖలో దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు. సిబ్బంది కొరత ప్రమాదాలకు దారి తీయవచ్చునని పేర్కొన్నారు. ఇటీవల కాన్పూరు వద్ద జరిగిన రెండు రైలు ప్రమాదాలతోనైనా దిద్దుబాటు చర్యలు తీసుకోకుంటే, రైల్వేభద్రతపై ప్రయాణికులకు విశ్వాçÜం సన్నగిల్లు తుందన్నారు. ఎక్కువమంది రైల్వే కార్మికులు జనావాసాలకు దూరంగా ఉంటున్నారని దేశంలో సగటున రోజుకు 21 వేల రైళ్లు నడుపుతున్నారని ఆయన అ న్నారు. ఏటా సుమారు 700 మంది కార్మికులు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారని, సుమారు 2500 మం ది గాయాలపాలవుతున్నారని రాఘవయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే కార్మికులకు కనీసవేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ అధ్యక్షుడు పి.ప్రభాకర్, సహాయ ప్రధాన కార్యదర్శి పెరుమాళ్లు, డివిజనల్ కార్యదర్శి వెంకటాచలపతిరావు తదితరులు పాల్గొన్నారు.