భారత్‌లో మూడింట 2 వంతుల మంది బ్లూ కాలర్ ఉద్యోగులు అంటే పొలం పనిచేసేవాళ్లు, మైనింగ్ వర్కర్లు, కనస్ట్రక్షన్,మ్యానిఫ్యాక్చరింగ్ ఉద్యోగులు నెలకు రూ.15,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారంటూ ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది.
పేరోల్ మేనేజ్మెంట్ యాప్ శాలరీబాక్స్ నివేదిక ప్రకారం..పని ప్రాంతాల్లో మహిళలు నెలకు సగటున రూ.12,398 సంపాదిస్తుండగా..వారి సహోద్యోగులైన పురుషుల కంటే 19 శాతం తక్కువ వేతనం తీసుకుంటున్నట్లు తేలింది. ఉద్యోగుల్లో 15 శాతం కంటే తక్కువ మంది నెలకు రూ.20,000-40,000 (సగటున రూ.25,000) వరకు సంపాదిస్తున్నారని డేటా హైలైట్ చేస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మెజారిటీ సంస్థలు కేంద్ర వేతన సంఘం (సిపిసి) నిర్ణయించిన కనీస వేతనం (అంటే నెలకు రూ.18,000.)కంటే తక్కువ వేతనాలు చెల్లిస్తాయని శాలరీ బాక్స్ తన నివేదికలో హైలెట్ చేసింది.
ఆ రంగాల్లో మహిళలకు అత్యధిక వేతనాలు
దేశవ్యాప్తంగా 850కి పైగా జిల్లాల నుండి వన్ మిలియన్‌కు పైగా శ్రామికులు డేటాబేస్ ఆధారంగా శాలరీ బాక్స్ ఈ నివేదికను రూపొందించినట్లు శాలరీబాక్స్ సీఈఓ , కో ఫౌండర్ నిఖిల్ గోయల్ ఒక ప్రకటనలో తెలిపారు. తమ సర్వేలో శ్రామిక శక్తిలో కేవలం 27 శాతం మంది మహిళలు మాత్రమే ఉన్నారని, 73 శాతం మంది శ్రామిక శక్తి పురుషులు ఉన్నట్లు గుర్తించామని అన్నారు.
సూపర్ మార్కెట్‌లు,కిరాణా స్టోర్ , జనరల్ స్టోర్లతో పాటు గార్మెంట్స్ టెక్స్‌టైల్ వంటి పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులకు నెలకు సగటున రూ.8,300 వేతనం తీసుకుంటున్నారని నిఖిల్ గోయల్ వెల్లడించారు. లాజిస్టిక్స్, ట్రాన్స్ పోర్ట్, ఐటి సాఫ్ట్ వేర్,టైలరింగ్, బొటిక్‌లలో మహిళలకు అత్యధిక ప్రాదాన్యం ఉందని, జీతాలు సైతం అదే స్థాయిలో ఉన్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment