salari
-
పాపం..వీరి నెల జీతం రూ.15వేల కంటే తక్కువే!
భారత్‌లో మూడింట 2 వంతుల మంది బ్లూ కాలర్ ఉద్యోగులు అంటే పొలం పనిచేసేవాళ్లు, మైనింగ్ వర్కర్లు, కనస్ట్రక్షన్,మ్యానిఫ్యాక్చరింగ్ ఉద్యోగులు నెలకు రూ.15,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారంటూ ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. పేరోల్ మేనేజ్మెంట్ యాప్ శాలరీబాక్స్ నివేదిక ప్రకారం..పని ప్రాంతాల్లో మహిళలు నెలకు సగటున రూ.12,398 సంపాదిస్తుండగా..వారి సహోద్యోగులైన పురుషుల కంటే 19 శాతం తక్కువ వేతనం తీసుకుంటున్నట్లు తేలింది. ఉద్యోగుల్లో 15 శాతం కంటే తక్కువ మంది నెలకు రూ.20,000-40,000 (సగటున రూ.25,000) వరకు సంపాదిస్తున్నారని డేటా హైలైట్ చేస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మెజారిటీ సంస్థలు కేంద్ర వేతన సంఘం (సిపిసి) నిర్ణయించిన కనీస వేతనం (అంటే నెలకు రూ.18,000.)కంటే తక్కువ వేతనాలు చెల్లిస్తాయని శాలరీ బాక్స్ తన నివేదికలో హైలెట్ చేసింది. ఆ రంగాల్లో మహిళలకు అత్యధిక వేతనాలు దేశవ్యాప్తంగా 850కి పైగా జిల్లాల నుండి వన్ మిలియన్‌కు పైగా శ్రామికులు డేటాబేస్ ఆధారంగా శాలరీ బాక్స్ ఈ నివేదికను రూపొందించినట్లు శాలరీబాక్స్ సీఈఓ , కో ఫౌండర్ నిఖిల్ గోయల్ ఒక ప్రకటనలో తెలిపారు. తమ సర్వేలో శ్రామిక శక్తిలో కేవలం 27 శాతం మంది మహిళలు మాత్రమే ఉన్నారని, 73 శాతం మంది శ్రామిక శక్తి పురుషులు ఉన్నట్లు గుర్తించామని అన్నారు. సూపర్ మార్కెట్లు,కిరాణా స్టోర్ , జనరల్ స్టోర్లతో పాటు గార్మెంట్స్ టెక్స్టైల్ వంటి పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులకు నెలకు సగటున రూ.8,300 వేతనం తీసుకుంటున్నారని నిఖిల్ గోయల్ వెల్లడించారు. లాజిస్టిక్స్, ట్రాన్స్ పోర్ట్, ఐటి సాఫ్ట్ వేర్,టైలరింగ్, బొటిక్‌లలో మహిళలకు అత్యధిక ప్రాదాన్యం ఉందని, జీతాలు సైతం అదే స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. -
ఐటీసీలో రూ.కోటికిపైగా వేతన ఉద్యోగులు 220
న్యూఢిల్లీ: ఐటీసీలో రూ.కోటికిపైగా వేతనం తీసుకునే ఉద్యోగుల సంఖ్య 220కు చేరింది. 2021–22 సంవత్సరంలో వీరి సంఖ్య 44 శాతం పెరిగినట్టు వార్షిక నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రతి నెలా రూ.8.5 లక్షలు (ఏడాదికి రూ.కోటి, అంతకంటే ఎక్కువ) అంతకుమించిన వేతన ఉద్యోగులు 2020–21 నాటికి 153 ఉండగా, 2021–22 నాటికి 220కి పెరిగిందని ఐటీసీ తన వార్షిక నివేదికలో పేర్కొంది. ఐటీసీ చైర్మన్, ఎండీ సంజీవ్‌పురి 2021–22లో అందుకున్న స్థూల వేతనం 5.35 శాతం పెరిగి రూ.12.59 కోట్లుగా ఉంది. ఇందులో రూ.2.64 కోట్ల కన్సాలిడేటెడ్ వేతనం, పెర్క్‌లు, ఇతర ప్రయోజనాలు రూ.49.63 లక్షలు, పనితీరు ఆధారిత బోనస్ రూ.7.52 కోట్లు ఉంది. 2020–21లో సంజీవ్‌పురి స్థూల వేతనం రూ.11.95 కోట్లుగా ఉంది. ఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీ సుమంత్ రూ.5.76 కోట్లు, మరో ఈడీ రవి టాండన్ రూ.5.60 కోట్ల చొప్పున గత ఆర్థిక సంవత్సరంలో అందుకున్నారు. 2021–22 చివరికి ఐటీసీలో మొత్తం ఉద్యోగులు 23,889 మంది ఉన్నారు. ఆశ్చర్యకరం ఏమిటంటే అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 8.4 శాతం తగ్గింది. మొత్తం ఉద్యోగుల్లో మహిళా ఉద్యోగుల శాతం చాలా తక్కువగా ఉంది. రూ.21,568 మంది పురుషులు ఉంటే, మహిళలు కేవలం 2,261 మంది ఉన్నాయి. పర్మినెంట్ కేటగిరీ కాకుండా ఇతర ఉద్యోగులు 25,513 మంది పనిచేస్తున్నారు. ఉద్యోగుల సగటు వేతనం గత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం పెరిగింది. ముఖ్యమైన ఉద్యోగులకు (కేఎంపీలు/కీలక బాధ్యతలు చూసేవారు) వేతన పెంపు 8 శాతంగా ఉంది. ఐటీసీ ఎఫ్ఎంసీజీ విభాగం స్పీడ్ గతేడాది రూ. 24,000 కోట్ల టర్నోవర్ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ఎఫ్ఎంసీజీ విభాగంలో రికార్డు టర్నోవర్‌ను సాధించింది. కంపెనీ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం ఈ విభాగంలో వినియోగదారు వ్యయాలు రూ. 24,000 కోట్లను తాకాయి. ఫుడ్, వ్యక్తిగత సంరక్షణ, ఎడ్యుకేషన్, స్టేషనరీ తదితర విభాగాలలో 25కుపైగా మదర్ బ్రాండ్స్‌తో కంపెనీ పురోభివృద్ధిని సాధిస్తున్నట్లు ఐటీసీ పేర్కొంది. గత కొన్నేళ్లుగా ఎఫ్ఎంసీజీ బిజినెస్ ప్రస్తావించదగ్గ పురోగతిని నమోదు చేస్తున్నట్లు తెలియజేసింది. అయితే ఇప్పటికీ పొగాకు బిజినెస్ నుంచే టర్నోవర్‌లో సగ భాగం సమకూరుతున్నట్లు వెల్లడించింది. గతేడాది ఐటీసీ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 59,101 కోట్ల టర్నోవర్‌ను ప్రకటించింది. గతేడాది దేశీయంగా 20 కోట్ల కుటుంబాలకు వినియోగ విభాగం చేరువైనట్లు వార్షిక నివేదికలో ఐటీసీ పేర్కొంది. ఎఫ్ఎంసీజీ విభాగంలో ఆశీర్వాద్, బింగో, సన్‌ఫీస్ట్, క్లాస్మేట్, శావ్లాన్, యిప్పీ తదితర సుప్రసిద్ధ బ్రాండ్లను కంపెనీ కలిగి ఉంది. ఎన్ఎస్ఈలో ఐటీసీ షేరు 2 శాతం క్షీణించి రూ. 265 వద్ద ముగిసింది. గత నెల 20న రూ. 282ను అధిగమించడం ద్వారా షేరు 52 వారాల గరిష్టాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. -
నా జీతం... రైతు బిడ్డల చదువు కోసం: హర్భజన్
భారత మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ పార్లమెంట్ సభ్యుడు హర్భజన్ సింగ్ తన పెద్ద మనసు చాటుకున్నాడు. రాజ్యసభ సభ్యుడి హోదాలో తనకు వచ్చే జీతాన్ని రైతు కుమార్తెల చదువు కోసం, వారి సంక్షేమం కోసం ఖర్చు చేస్తానని హర్భజన్ ‘ట్విటర్’ ద్వారా వెల్లడించాడు. గత ఏడాది డిసెంబర్లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన హర్భజన్ ఇటీవల పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. -
సర్పంచ్‌లకేదీ గౌరవం?
పదినెలలుగా అందని వేతనాలు నిధుల విడుదలలో సర్కారు జాప్యం పెగడపల్లి : ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలన్నా.. గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా సర్పంచులదే కీలకపాత్ర. గ్రామప్రజలకు సేవ చేస్తున్నందుకుగాను గతంలో సర్పంచులకు నెలనెలా రూ.1500లను ‘గౌరవవేతనం’ కింద అందేవి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక.. ఆ మెుత్తాన్ని రూ.ఐదు వేలకు పెంచింది. కానీ.. ఆ వేతనాలను మాత్రం నెలనెలా విడుదల చేయడంలో నిర్లక్ష్యం చూపుతోంది. ఫలితంగా సర్పంచులు నిరాశకు గురవుతున్నారు. పెంచిన గౌరవ వేతనాన్ని సర్కారు 2015 సెప్టెంబర్ వరకు మాత్రమే అందించింది. అప్పటి నుంచి జూలై 2016 వరకు (10 నెలల) వేతనాలు అందాల్సి ఉంది. పంచాయతీల ప్రథమపౌరులమైన తమపట్ల సర్కారు చిన్నచూపు చూస్తోందని సర్పంచులు ఆవేదన చెందుతున్నారు. గౌరవవేతనాలు సకాలంలో చెల్లించకుండా అగౌరవ పరుస్తోందని పేర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రజల్లోకి తీసికెళ్లి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నా వేతనాలు ఇవ్వకుండా నిరాశ పరుస్తోందంటున్నారు.