
సాక్షి, నార్సింగ్‌పూర్: ఓ వ్యక్తి తన ప్రేయసిపై వేడినీళ్లు గుమ్మరించిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. నార్సింగ్‌పూర్‌లోని కెడియా గ్రామానికి చెందిన సూరజ్ ప్రభుదయాల్ యాదవ్, అతని ప్రేయసి ఇద్దరూ భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పని చేస్తుంటారు. వీరిద్దరూ మంకాపూర్‌లో ఓ గది తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఇక ఈ మధ్య ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న సూరజ్ గురువారం ఆమెతో గొడవకు దిగాడు. వీరి తగవు తారాస్థాయికి చేరుకోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రియుడు ఆమెపై పొగలు కక్కుతున్న వేడినీళ్లు పోశాడు. దీంతో కాలిన గాయాలతో పడి ఉన్న మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
చదవండి: భార్య తలతో 1.5 కిలోమీటర్లు..
Comments
Please login to add a commentAdd a comment