ఫొటోగ్రాఫర్లను అసంఘటిత కార్మికులుగా గుర్తించాలి
ఫొటోగ్రాఫర్లను అసంఘటిత కార్మికులుగా గుర్తించాలి
Published Wed, Jul 27 2016 12:34 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
జిల్లా అసోసియేషన్ డిమాండ్
కడియం :
ఫొటో, వీడియో గ్రాఫర్లను అసంఘటిత రంగ కార్మికులుగా గుర్తించి, ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని జిల్లా ఫొటో, వీడియో గ్రాఫర్స్ సంఘ సమావేశం తీర్మానించింది. మండలంలోని పుష్పలత పూలవర్తక సంఘం కల్యాణ మండపంలో జిల్లా ఫొటో, వీడియో గ్రాఫర్స్ సంఘ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్లమిల్లి రామారెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు. అదేరోజున సభ్యులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తామన్నారు. సభ్యులకు బీమా కూడా చేయిస్తున్నామని, చనిపోయిన సభ్యుల కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. సంఘం ద్వారా ఉత్తమ ఫొటోగ్రాఫర్స్‌ను గుర్తించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయాలని నిర్ణయించారు. జిల్లాలోని 38 అసోసియేషన్లలోను యాక్టివ్‌గా ఉండే సంఘానికి బెస్ట్ అసోసియేషన్‌గా గుర్తించి అవార్డు అందించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవాద్యక్షుడు అల్లు బాబి, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్. గిరి, అసోసియేషన్ నాయకులు మధు, పుల్లెపు సత్యనారాయణ(బాబు), మార్ని లక్ష్మీనారాయణచౌదరి సూరిబాబు, జిల్లా వ్యాప్తంగా అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Advertisement