videographers
-
ఫొటోగ్రాఫర్లను అసంఘటిత కార్మికులుగా గుర్తించాలి
జిల్లా అసోసియేషన్ డిమాండ్ కడియం : ఫొటో, వీడియో గ్రాఫర్లను అసంఘటిత రంగ కార్మికులుగా గుర్తించి, ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని జిల్లా ఫొటో, వీడియో గ్రాఫర్స్ సంఘ సమావేశం తీర్మానించింది. మండలంలోని పుష్పలత పూలవర్తక సంఘం కల్యాణ మండపంలో జిల్లా ఫొటో, వీడియో గ్రాఫర్స్ సంఘ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్లమిల్లి రామారెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు. అదేరోజున సభ్యులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తామన్నారు. సభ్యులకు బీమా కూడా చేయిస్తున్నామని, చనిపోయిన సభ్యుల కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. సంఘం ద్వారా ఉత్తమ ఫొటోగ్రాఫర్స్‌ను గుర్తించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయాలని నిర్ణయించారు. జిల్లాలోని 38 అసోసియేషన్లలోను యాక్టివ్‌గా ఉండే సంఘానికి బెస్ట్ అసోసియేషన్‌గా గుర్తించి అవార్డు అందించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవాద్యక్షుడు అల్లు బాబి, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్. గిరి, అసోసియేషన్ నాయకులు మధు, పుల్లెపు సత్యనారాయణ(బాబు), మార్ని లక్ష్మీనారాయణచౌదరి సూరిబాబు, జిల్లా వ్యాప్తంగా అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆమె.. విజయం
ఇంటికే పరిమితం.. భర్త, పిల్లలు, కుటుంబ పోషణ మాత్రమే ఆమె విధి... అంటూ కొన్నేళ్ల క్రితం మహిళలకు సంబంధించి పరిచయ వాక్యాలు ఉండేవి. కానీ ఇప్పుడు.. ఇంటా మేమే, బయటా మేమే అన్నట్లుగా అన్ని రంగాల్లోనూ మహిళలు ప్రతిభ కనబరుస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక, ఉద్యోగ రంగాల్లోనే కాదు.. వృత్తి, వ్యాపారాల్లోనూ మహిళలు సాధిస్తున్న విజయాలు అన్నీ ఇన్నీ కావు. పురాణ, ఇతిహాసాల్లో చెప్పుకున్నట్లు ‘స్త్రీ.. శక్తి స్వరూపిణి’ అనే మాట నిజమవుతోంది. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రత్యేకత చాటుకుంటున్న మహిళల స్ఫూర్తిదాయక కథనాలు... డాటర్ ఈస్ నాట్ ఏ టెన్షన్.. డాటర్ ఈస్ ఈక్వల్ టూ టెన్‘సన్స్’... ఈ కొటేషన్ ఇటీవల తరచూ సామాజిక మాధ్యమాల్లో లైక్‌లు, షేర్లు సంపాదించుకుంటోంది. వినడానికి, చదవడానికే కాదు ఈ కొటేషన్ నిజం కూడా! గతంలో మాదిరిగా తల్లిదండ్రులు కుమార్తె-కుమారులను వేర్వేరుగా చూడకపోరుునా అక్కడక్కడా అసమానతలు కనిపిస్తూనే ఉన్నారుు. అయితే, ఈ అసమానతలను కూడా జరుుస్తున్న వారెందరో ఉన్నారు. కుటుంబీకుల ప్రోత్సాహం, సమాజం నుంచి వస్తున్న అవకాశాలు వెరసి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వివిధ రంగాల్లో ఉన్నత స్థారుుకి చేరిన, కుటుంబాన్ని నడిపిస్తున్న కొందరు మహిళల విజయగాథలు నేటి ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా పాఠకుల కోసం... ఫొటోగ్రఫీలో రా‘రాణి’ పోచమ్మమైదాన్ : క్షణం కన్నువాల్చకుండా ప్రయత్నిస్తేనే వినియోగదారుడు నచ్చేలా ఫొటో తీయడం సాధ్యమవుతుంది. దీనికోసం గంటల తరబడి నిల్చోవాల్సి వస్తుంది. అలాంటి ఫొటోగ్రఫీ రంగంలో పురుషులే నిలదొక్కుకోవడం కష్టం. కానీ వరంగల్‌కు చెందిన రాణి అలియాస్ సోని జిల్లాలోని మొదటి మహిళా ఫొటో, వీడియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకుని ముందుకు సాగుతున్నారు. తొలుత ఫొటో.. ఆపై వీడియో 1997లో నగరంలోని దేశాయిపేటకు చెందిన పోలెపాక మధును రాణి వివాహం చేసుకుంది. అప్పటికే స్టూడియో నడిస్తున్న మధు.. నష్టాల కారణంగా మూసివేసి డీజిల్ మెకానిక్, డ్రైవర్‌గా జీవనం ప్రారంభించాడు. అయితే, ఇద్దరు కుమారులు జన్మించాక ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయాలో పాలుపోని రాణి దృష్టి ఫొటోగ్రఫీ రంగం వైపు పడింది. అంతలోనే మధు దేశాయిపేట రోడ్డులో సోని పేరిట స్టూడియో తెరిచారు. అయితే, ఔట్ డోర్ కార్యక్రమాలకు భర్త వెళ్లినప్పుడు గిరాకీ వచ్చి తిరిగి వెళ్తుండడంతో బాధపడిన రాణి భర్త సహకారంతో ఫొటోగ్రఫీలో ఓనమాలు నేర్చుకుంది. ఆ తర్వాత వీడియో కూడా నేర్చుకుని పట్టు సాధించింది. ఇలా కార్యక్రమాలకు కూడా భర్తతో పాటు వెళ్తే ఆమె పలు అధునాతన కెమెరాలు ఆపరేట్ చేయడంలో కూడా నైపుణ్యం సాధించింది. ఈ మేరకు లయన్సక్లబ్, ఫొటోగ్రాఫర్స అసోసియేషన్, గణతంత్ర దినోత్సవం సందర్భంగా అధికారిక అవార్డు, యువజన సంక్షేమ శాఖ అవార్డులే కాకుండా ఎప్సన్ కంపెనీ ఫొటో షూట్లో సోని తీసిన ఫొటోకు ద్వితీయ బహుమతి లభించడం విశేషం. అలాగే, ఫొటోగ్రఫీ రంగంలో మరిన్ని మెళకువలు నేర్చుకునేందుకు హైదరాబాద్, ముంబై ప్రాంతాల్లో జరిగిన వర్కషాప్ల్లో రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కష్టాన్ని ఇష్టంగా మలుచుకోవడం వల్లే ఫొటోగ్రఫీ రంగంలో రాణిస్తున్నట్లు తెలిపారు. మహిళలకే ప్రత్యేకమైన ఫంక్షన్లలో తనకే ప్రాధాన్యత ఇస్తుంటారని పేర్కొన్నారు. -
నేడు పరిషత్ తుది పోరు
సాక్షి, నెల్లూరు జిల్లాలో పరిషత్ ఎన్నికల రెండో విడత పోరు శుక్రవారం జరగనుంది. మొత్తం 25 జెడ్పీటీసీ స్థానాలకు, 311 ఎంపీటీసీ స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో 7,83,654 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 3,87,068 మంది, స్త్రీలు 3,96,583 మంది, ఇతరులు ముగ్గురు ఉన్నారు. ఈ నెల 6న తొలివిడత ఎన్నికల్లో భాగంగా 21 జెడ్పీటీసీ, 258 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం జరగనున్న మలివిడత ఎన్నికల్లో మొత్తం 25 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 100 మంది, 311 ఎంపీటీసీ స్థానాలకు 883 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 1,062 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఎన్నికలు జరగనున్న 25 మండలాల్లో 112 అతి సమస్యాత్మక గ్రామాలు, 207 సమస్యాత్మక గ్రామాలుగా అధికారులు గుర్తించారు. ఈ గ్రామాలపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి ఇప్పటికే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వాటిని ఏ విధంగా చక్కబెట్టాలనే విషయమై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా ప్రిసైడింగ్ అధికారులకు జిల్లా పాలనాధికారి ఎన్.శ్రీకాంత్ పదేపదే జాగ్రత్తలు చెప్పడంతో పాటు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో వెబ్‌కెమెరాలు, వీడియోగ్రాఫర్లను ఏర్పాటు చేసి అన్ని అంశాలను చిత్రీకరించే విధంగా చర్యలు చేపట్టారు. ఈ ఎన్నికలకు సంబంధించి 5,848 మంది ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులు విధులను నిర్వర్తించనున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఇప్పటికే అవసరమయ్యే బ్యాలెట్ బాక్సులు, ఇతర సామాగ్రితో పాటు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం జరగనున్న ఎన్నికల్లో ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. కౌంటిగ్ కేంద్రాలు ఇవే : 25 జెడ్పీటీసీ స్థా నాలకు జరిగే ఎన్నికలకు సంబంధించి నెల్లూరులోని డీకే మహిళా కళాశాల, గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల, నాయుడుపేటలోని నారాయణ జూని యర్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు చర్యలు చేపట్టారు. చేజర్ల, కలువాయి, ఇందుకూరుపేట, నెల్లూరు, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, పొదలకూరు, రాపూరు మండలాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను నెల్లూరులోని డీకే ప్రభుత్వ మహిళా కళాశాలకు చేర్చడంతో పాటు అక్కడే నిర్ణయించిన తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మనుబోలు, గూడూరు, చిల్లకూరు, చిట్టమూరు, కోట, వాకాడు, సైదాపురం, డక్కిలి, వెంకటగిరి, బాలాయపల్లి, మండలాలకు సంబంధించి గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు, దొరవారిసత్రం, సూళ్లూరుపేట, తడ మండలాలకు సంబంధించి నాయుడుపేటలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.