ఆమె.. విజయం | 'queen' in the Photography | Sakshi
Sakshi News home page

ఆమె.. విజయం

Published Tue, Mar 8 2016 1:06 AM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM

ఆమె.. విజయం

ఆమె.. విజయం

ఇంటికే పరిమితం.. భర్త, పిల్లలు, కుటుంబ పోషణ  మాత్రమే ఆమె విధి... అంటూ కొన్నేళ్ల క్రితం మహిళలకు సంబంధించి పరిచయ వాక్యాలు ఉండేవి. కానీ ఇప్పుడు.. ఇంటా మేమే, బయటా మేమే అన్నట్లుగా అన్ని రంగాల్లోనూ మహిళలు ప్రతిభ కనబరుస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక, ఉద్యోగ రంగాల్లోనే కాదు.. వృత్తి, వ్యాపారాల్లోనూ మహిళలు సాధిస్తున్న విజయాలు అన్నీ ఇన్నీ కావు. పురాణ, ఇతిహాసాల్లో చెప్పుకున్నట్లు ‘స్త్రీ.. శక్తి స్వరూపిణి’ అనే మాట నిజమవుతోంది. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రత్యేకత చాటుకుంటున్న మహిళల స్ఫూర్తిదాయక కథనాలు...
 
డాటర్ ఈస్ నాట్ ఏ టెన్షన్.. డాటర్ ఈస్ ఈక్వల్ టూ టెన్‌‘సన్స్’... ఈ కొటేషన్ ఇటీవల తరచూ సామాజిక మాధ్యమాల్లో లైక్‌లు, షేర్లు సంపాదించుకుంటోంది. వినడానికి, చదవడానికే కాదు ఈ కొటేషన్ నిజం కూడా! గతంలో మాదిరిగా తల్లిదండ్రులు కుమార్తె-కుమారులను వేర్వేరుగా చూడకపోరుునా అక్కడక్కడా అసమానతలు కనిపిస్తూనే ఉన్నారుు. అయితే, ఈ అసమానతలను కూడా జరుుస్తున్న వారెందరో ఉన్నారు. కుటుంబీకుల ప్రోత్సాహం, సమాజం నుంచి వస్తున్న అవకాశాలు వెరసి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వివిధ రంగాల్లో ఉన్నత స్థారుుకి చేరిన, కుటుంబాన్ని నడిపిస్తున్న కొందరు మహిళల విజయగాథలు నేటి ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా పాఠకుల కోసం...
 
ఫొటోగ్రఫీలో రా‘రాణి’
పోచమ్మమైదాన్ : క్షణం కన్నువాల్చకుండా ప్రయత్నిస్తేనే వినియోగదారుడు నచ్చేలా ఫొటో తీయడం సాధ్యమవుతుంది. దీనికోసం గంటల తరబడి నిల్చోవాల్సి వస్తుంది. అలాంటి ఫొటోగ్రఫీ రంగంలో పురుషులే నిలదొక్కుకోవడం కష్టం. కానీ వరంగల్‌కు చెందిన రాణి అలియాస్ సోని జిల్లాలోని మొదటి మహిళా ఫొటో, వీడియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకుని ముందుకు సాగుతున్నారు.
 
తొలుత ఫొటో.. ఆపై వీడియో
1997లో నగరంలోని దేశాయిపేటకు చెందిన పోలెపాక మధును రాణి వివాహం చేసుకుంది. అప్పటికే స్టూడియో నడిస్తున్న మధు.. నష్టాల కారణంగా మూసివేసి డీజిల్ మెకానిక్, డ్రైవర్‌గా జీవనం ప్రారంభించాడు. అయితే, ఇద్దరు కుమారులు జన్మించాక ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయాలో పాలుపోని రాణి దృష్టి ఫొటోగ్రఫీ రంగం వైపు పడింది. అంతలోనే మధు దేశాయిపేట రోడ్డులో సోని పేరిట స్టూడియో తెరిచారు. అయితే, ఔట్ డోర్ కార్యక్రమాలకు భర్త వెళ్లినప్పుడు గిరాకీ వచ్చి తిరిగి వెళ్తుండడంతో బాధపడిన రాణి భర్త సహకారంతో ఫొటోగ్రఫీలో ఓనమాలు నేర్చుకుంది. ఆ తర్వాత వీడియో కూడా నేర్చుకుని పట్టు సాధించింది. ఇలా కార్యక్రమాలకు కూడా భర్తతో పాటు వెళ్తే ఆమె పలు అధునాతన కెమెరాలు ఆపరేట్ చేయడంలో కూడా నైపుణ్యం సాధించింది. ఈ మేరకు లయన్‌‌సక్లబ్, ఫొటోగ్రాఫర్‌‌స అసోసియేషన్, గణతంత్ర దినోత్సవం సందర్భంగా అధికారిక అవార్డు, యువజన సంక్షేమ శాఖ అవార్డులే కాకుండా ఎప్సన్ కంపెనీ ఫొటో షూట్‌లో సోని తీసిన ఫొటోకు ద్వితీయ బహుమతి లభించడం విశేషం. అలాగే, ఫొటోగ్రఫీ రంగంలో మరిన్ని మెళకువలు నేర్చుకునేందుకు హైదరాబాద్, ముంబై ప్రాంతాల్లో జరిగిన వర్‌‌కషాప్‌ల్లో రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కష్టాన్ని ఇష్టంగా మలుచుకోవడం వల్లే ఫొటోగ్రఫీ రంగంలో రాణిస్తున్నట్లు తెలిపారు. మహిళలకే ప్రత్యేకమైన ఫంక్షన్లలో తనకే ప్రాధాన్యత ఇస్తుంటారని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement