family nutrition
-
Ankita Shah: ఆసరాకు అంకితం
ఆడపిల్లలు తల్లికి ఇంటి పనుల్లో తప్ప తండ్రికి ఏవిధంగా సాయపడగలరు... అనే ఆలోచన నిన్నామొన్నటి వరకు సమాజంలో ఉండేది. ఇప్పుడు ఏమరుపాటుగా కూడా అలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదని నిరూపిస్తున్నారు అంకితలాంటి అమ్మాయిలు. గుజరాత్లో పుట్టి పెరిగిన అంకిత షా దివ్యాంగురాలైనా ఆటో నడుపుతూ తల్లిదండ్రులకు ఆసరా అయ్యింది. జీవితంలో నిలదొక్కుకోవడానికి తనలాంటి దివ్యాంగులకు ప్రేరణ గా నిలుస్తోంది. అంకిత ఏడాది బిడ్డగా ఉన్నప్పుడు పోలియో వచ్చి కుడికాలు వైకల్యానికి లోనైంది. అయినా, తల్లిదండ్రులు ఆమెను చదువులో ప్రోత్సహించారు. దీంతో ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసింది అంకిత. 2009లో ఉద్యోగం కోసం అహ్మదాబాద్ కు వెళ్లింది. చుక్కెదురైంది అక్కడ. అక్కడనే కాదు, అలా చాలా చోట్ల ఇంటర్వ్యూలకు హాజరయ్యింది. కానీ, ప్రతీచోటా తిరస్కారాన్నే ఎదుర్కొంది. కొన్ని ఆఫీసులలో వైకల్యం కారణంగా జాబ్ ఇవ్వలేమన్నారు. అంకిత కుటుంబంలో తోబుట్టువులతో కలిపి ఏడుగురు సభ్యులు. తండ్రి సంపాదన పైనే ఇల్లు గడిచేది. అంకిత చిన్న చిన్న పనులు వెతుక్కొని చేసినా అవేవీ కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. ఇది చాలదన్నట్టు అంకిత తండ్రి నాలుగేళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడ్డాడు. మనో ధైర్యమే ఊతంగా.. సంపాదించే పెద్ద దిక్కు లేకపోతే ఆ కుటుంబం ఎలాంటి పరిస్థితిలో ఉంటుందో ఊహించవచ్చు. అప్పటికీ కుటుంబ పోషణకు సరిపడా ఉద్యోగం కోసం అంకిత వెతుకుతూనే ఉంది. అలాంటి సమయంలోనే దివ్యాంగుడైన ఆటో డ్రైవర్ లాల్జీ బారోట్ పరిచయం అయ్యాడు. ఏ పనీ దొరక్క చాలా ఇబ్బందిగా ఉందని చెప్పడంతో అతను అంకితకు ఆటో నడపడం నేర్పించాడు. ఆటో నడపడం పూర్తిగా వచ్చాక, లైసెన్స్ తీసుకుంది అంకిత. ఆటో రిక్షా కొనుగోలులోనూ అంకితకు సాయం చేశాడు బారోట్. దీంతో మూడేళ్లుగా అంకిత ఆటో డ్రైవింగ్ చేస్తూ నెలకు రూ.25 వేలు సంపాదిస్తోంది. ‘డ్రైవింగ్ వల్ల మొదట్లో వళ్లు నొప్పులు వచ్చేవి అయినా, కుటుంబం కళ్ల ముందు మెదిలి మనోధైర్యాన్నే ఊతంగా చేసుకుంది. శక్తినంతా కూడదీసుకొని డ్రైవింగ్‌లో నైపుణ్యం సాధించింది. ‘రోజూ ఉదయం 10:30 గంటల నుంచి ఆటో నడపడానికి బయల్దేరుతాను. తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రి 8:30 గంటలు అవుతుంది. మా నాన్న బాధ్యత తీసుకోగలిగాను అనే ఆనందంతోపాటు కుటుంబానికి భరోసాగా ఉన్నాను అనే సంతృప్తి కలుగుతుంది. ధైర్యం చేసి ఉండకపోతే ఈ రోజు మా కుటుంబం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది’ అంటోంది అంకిత. తండ్రి బాధ్యతను భుజాలకెత్తుకున్న కూతురుగానే కాదు దివ్యాంగులకూ ప్రేరణగా నిలుస్తోంది అంకిత. -
అనుకోని మలుపులలో ఆదుకునే పిలుపు
ఉమన్ ఫైనాన్స్ / వ్యక్తిగత ప్రమాద బీమా ప్రస్తుత పరిస్థితులను మనం గమనించినట్లయితే భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే గాని వారి కుటుంబ పోషణకు, భవిష్యత్తు లక్ష్యాలకు అవసరమైన మొత్తాన్ని సమకూర్చుకోలేరు. మరి ఆ సంపాదించే వారికి అనుకోని ప్రమాదం జరిగితే వచ్చే ఆర్థిక ఇబ్బందులను ఆ కుటుంబం తట్టుకోగలదా? ఇలాంటి అనూహ్యమైన పరిస్థితులలో జీవిత, ఆరోగ్య బీమాతో పాటుగా వ్యక్తిగత ప్రమాద బీమా కూడా ఎంతో చేయూతనిస్తుంది. పాలసీదారుని మరణానంతరం వారి కుటుంబానికి ఆర్థిక చేయూతనివ్వడానికి జీవిత బీమా, అలాగే వైద్యానికి సంబంధించిన ఖర్చులను తట్టుకోడానికి ఆరోగ్య బీమా ఉపయోగపడతాయి. కొన్నిసార్లు ఆ వ్యక్తి ప్రమాదం కారణంగా పూర్తి కోలుకోవడానికి కొన్ని వారాలు, నెలలు, సంవత్సరాలు పట్టవచ్చు. ఈ క్రమంలో వారి ఆదాయం ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగత ప్రమాద బీమా ఆర్థికంగా ఎంతో తోడ్పాటునిస్తుంది. ఈ బీమా ఏ విధంగా పని చేస్తుందో చూద్దాం. ప్రమాదం ద్వారా మరణం సంభవిస్తే... పాలసీదారునికి ప్రమాదం ద్వారా మరణం సంభవించినట్లయితే అతను ఎంత మొత్తానికి పాలసీ తీసుకున్నారో ఆ మొత్తాన్ని నామినీకి అందజేస్తారు. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు అదనంగా వారి పిల్లల విద్యకు బోనస్‌ను (ఇద్దరు పిల్లల వరకు) ఇస్తున్నాయి. శాశ్వతంగా పూర్తి వైకల్యం సంభవిస్తే... ప్రమాదంలో కొన్నిసార్లు పూర్తి వైకల్యం సంభవించే పరిస్థితులు ఏర్పడతాయి. ఉదాహరణకు రెండు కాళ్లు / రెండు చేతులు పోవడం. ఒక కాలు, ఒక చేయి పోవడం మొదలైనవి. ఈ సందర్భంలో ఆ వ్యక్తి ఎటువంటి పని చేయడానికీ వీలుండదు. ఇలాంటి వాటిని శాశ్వతమైన పూర్తి వైకల్యంగా పరిగణిస్తారు. ఈ పరిస్థితుల్లో కొన్ని కంపెనీలు పాలసీదారుడు ఎంత మొత్తాన్ని పాలసీగా తీసుకుంటారో ఆ మొత్తాన్నీ, మరికొన్ని కంపెనీలు 10 శాతం, 20 శాతం అదనంగా కూడా అందజేస్తున్నాయి. అందుకే పాలసీ తీసుకోబోయే ముందు ఈ విషయాన్ని పూర్తిగా పరిశీలించి తీసుకోవడం మంచిది. శాశ్వత, పాక్షిక వైకల్యం... కొన్నిసార్లు ప్రమాదం జరిగినప్పుడు పాక్షికంగా కొంత మేర శాశ్వత వైకల్యం ఏర్పడవచ్చు. అలాంటప్పుడు వైకల్యం ఎంత మేరకు (ఎంత శాతం) జరిగిందో, ఆ శాతం ఆధారంగా నష్టపరిహారం ఉంటుంది. తాత్కాలిక వైకల్యం.. కొన్నిసార్లు ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం నుండి కోలుకుని మళ్లీ పని చేయడం మొదలు పెట్టడానికి సమయం పడుతుంది. ఈ సమయంలో అతను కోల్పోయిన ఆదాయాన్ని భర్తీ చేయడానికి వారానికి కొంత మొత్తాన్ని పాలసీదారునికి అందజేస్తారు. వ్యక్తిగత బీమా పాలసీని వ్యక్తిగతంగానూ, ఆలాగే జీవిత భాగస్వామి, పిల్లల పేర్ల మీద కూడా ఒకే పాలసీ కింద తీసుకోవచ్చు. అలా తీసుకున్నప్పుడు 10 శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చు. గరిష్టంగా ఎంత మొత్తానికి పాలసీ ఇస్తారు అనేది మీ ఆదాయాన్ని బట్టి ఉంటుంది. అలాగే మీరు కట్టే కంపెనీని బట్టి కూడా మారుతుంది. పాలసీని తీసుకోవడం ఎంత ముఖ్యమో, ఆ పాలసీ గురించి మీ కుటుంబ సభ్యులందరికీ ముందే అవగాహన కల్పించడం కూడా అంతే ముఖ్యం. ఇలా అవగాహన కల్పించడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకి వెంటనే సమాచారం ఇవ్వడం, పరిహారం పొందడానికి అవసరమైన ఇతర పత్రాలు (పోలీస్ ఎఫ్.ఐ.ఆర్., వైద్య పరీక్షల నివేదికలు మొదలైనవి) సమకూర్చడంలో ఇబ్బందులు ఎదుర్కోనవసరం లేకుండా ఉంటుంది. ప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని పూర్తిగా భర్తీ చేసుకోలేకపోవచ్చు. కానీ ఆర్థికంగా పూర్తి చేయూతనివ్వడానికి ఈ వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
ఆమె.. విజయం
ఇంటికే పరిమితం.. భర్త, పిల్లలు, కుటుంబ పోషణ మాత్రమే ఆమె విధి... అంటూ కొన్నేళ్ల క్రితం మహిళలకు సంబంధించి పరిచయ వాక్యాలు ఉండేవి. కానీ ఇప్పుడు.. ఇంటా మేమే, బయటా మేమే అన్నట్లుగా అన్ని రంగాల్లోనూ మహిళలు ప్రతిభ కనబరుస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక, ఉద్యోగ రంగాల్లోనే కాదు.. వృత్తి, వ్యాపారాల్లోనూ మహిళలు సాధిస్తున్న విజయాలు అన్నీ ఇన్నీ కావు. పురాణ, ఇతిహాసాల్లో చెప్పుకున్నట్లు ‘స్త్రీ.. శక్తి స్వరూపిణి’ అనే మాట నిజమవుతోంది. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రత్యేకత చాటుకుంటున్న మహిళల స్ఫూర్తిదాయక కథనాలు... డాటర్ ఈస్ నాట్ ఏ టెన్షన్.. డాటర్ ఈస్ ఈక్వల్ టూ టెన్‘సన్స్’... ఈ కొటేషన్ ఇటీవల తరచూ సామాజిక మాధ్యమాల్లో లైక్‌లు, షేర్లు సంపాదించుకుంటోంది. వినడానికి, చదవడానికే కాదు ఈ కొటేషన్ నిజం కూడా! గతంలో మాదిరిగా తల్లిదండ్రులు కుమార్తె-కుమారులను వేర్వేరుగా చూడకపోరుునా అక్కడక్కడా అసమానతలు కనిపిస్తూనే ఉన్నారుు. అయితే, ఈ అసమానతలను కూడా జరుుస్తున్న వారెందరో ఉన్నారు. కుటుంబీకుల ప్రోత్సాహం, సమాజం నుంచి వస్తున్న అవకాశాలు వెరసి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వివిధ రంగాల్లో ఉన్నత స్థారుుకి చేరిన, కుటుంబాన్ని నడిపిస్తున్న కొందరు మహిళల విజయగాథలు నేటి ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా పాఠకుల కోసం... ఫొటోగ్రఫీలో రా‘రాణి’ పోచమ్మమైదాన్ : క్షణం కన్నువాల్చకుండా ప్రయత్నిస్తేనే వినియోగదారుడు నచ్చేలా ఫొటో తీయడం సాధ్యమవుతుంది. దీనికోసం గంటల తరబడి నిల్చోవాల్సి వస్తుంది. అలాంటి ఫొటోగ్రఫీ రంగంలో పురుషులే నిలదొక్కుకోవడం కష్టం. కానీ వరంగల్‌కు చెందిన రాణి అలియాస్ సోని జిల్లాలోని మొదటి మహిళా ఫొటో, వీడియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకుని ముందుకు సాగుతున్నారు. తొలుత ఫొటో.. ఆపై వీడియో 1997లో నగరంలోని దేశాయిపేటకు చెందిన పోలెపాక మధును రాణి వివాహం చేసుకుంది. అప్పటికే స్టూడియో నడిస్తున్న మధు.. నష్టాల కారణంగా మూసివేసి డీజిల్ మెకానిక్, డ్రైవర్‌గా జీవనం ప్రారంభించాడు. అయితే, ఇద్దరు కుమారులు జన్మించాక ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయాలో పాలుపోని రాణి దృష్టి ఫొటోగ్రఫీ రంగం వైపు పడింది. అంతలోనే మధు దేశాయిపేట రోడ్డులో సోని పేరిట స్టూడియో తెరిచారు. అయితే, ఔట్ డోర్ కార్యక్రమాలకు భర్త వెళ్లినప్పుడు గిరాకీ వచ్చి తిరిగి వెళ్తుండడంతో బాధపడిన రాణి భర్త సహకారంతో ఫొటోగ్రఫీలో ఓనమాలు నేర్చుకుంది. ఆ తర్వాత వీడియో కూడా నేర్చుకుని పట్టు సాధించింది. ఇలా కార్యక్రమాలకు కూడా భర్తతో పాటు వెళ్తే ఆమె పలు అధునాతన కెమెరాలు ఆపరేట్ చేయడంలో కూడా నైపుణ్యం సాధించింది. ఈ మేరకు లయన్సక్లబ్, ఫొటోగ్రాఫర్స అసోసియేషన్, గణతంత్ర దినోత్సవం సందర్భంగా అధికారిక అవార్డు, యువజన సంక్షేమ శాఖ అవార్డులే కాకుండా ఎప్సన్ కంపెనీ ఫొటో షూట్లో సోని తీసిన ఫొటోకు ద్వితీయ బహుమతి లభించడం విశేషం. అలాగే, ఫొటోగ్రఫీ రంగంలో మరిన్ని మెళకువలు నేర్చుకునేందుకు హైదరాబాద్, ముంబై ప్రాంతాల్లో జరిగిన వర్కషాప్ల్లో రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కష్టాన్ని ఇష్టంగా మలుచుకోవడం వల్లే ఫొటోగ్రఫీ రంగంలో రాణిస్తున్నట్లు తెలిపారు. మహిళలకే ప్రత్యేకమైన ఫంక్షన్లలో తనకే ప్రాధాన్యత ఇస్తుంటారని పేర్కొన్నారు. -
మా అమ్మను బతికించండి
వారిదో నిరుపేద కుటుంబం. భార్యాభర్త... ఇద్దరు పిల్లలు. భర్త అంధుడు కావడంతో కుటుంబపోషణంతా ఆమెపైనే... రెక్కలు ముక్కలు చేసుకుని కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని సాకింది. ప్రభుత్వం ఇచ్చిన 20 గుంటల భూమికి మరో 20 గుంటలు కౌలుకు తీసుకుని పత్తి వేయగా... కలిసిరాని కాలం కరువు రూపంలో వెంటాడింది. పెట్టుబడి, కుటుంబపోషణకు చేసిన అప్పు తీర్చే మార్గం కనిపించక చావే శరణ్యమనుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మెరుగైన వైద్యం అందిస్తే బతికే అవకాశముండడంతో తల్లిని బతికించుకునేందుకు ఆ పన్నెండేళ్ల పిల్లాడు చేతులు జోడించి వేడుకుంటున్నాడు. * అప్పులబాధతో మహిళా రైతు ఆత్మహత్యాయత్నం * చికిత్సకు చిల్లిగవ్వ లేక చావుబతుకుల మధ్య పోరాటం * అంధుడైన భర్త.. ఇద్దరు పిల్లలకు ఆమే ఆధారం * దాతలు సాయం చేస్తే నిలువనున్న నిండుప్రాణం జమ్మికుంట: వీణవంక మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన కారుపాకల రమ-రవిది నిరుపేద కుటుంబం. వీరికి కుమారుడు అంజి(12), కుమార్తె అమూల్య(7) ఉన్నారు. రవి అంధుడు కావడంతో కుటుంబపోషణ భారమంతా రమపైనే. కూలీ పనులకు వెళ్తూ రెక్కలు ముక్కలు చేసుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో అంజి ఏడో తరగతి, అమూల్య రెండో తరగతి చదువుతున్నారు. ప్రభుత్వం గతంలో వీరికి 20 గుంటల భూమి మంజూరు చేసింది. ఈ 20 గుంటలతోపాటు పక్కనే ఉన్న మరో 20 గుంటలు కౌలుకు తీసుకుని ఈ ఏడాది పత్తిపంట వేశారు. మిగతా సమయంలో ఆమె కూలీకి వెళ్తుంది. సాగు పెట్టుబడి కోసం రూ.20 వేలు అప్పు చేశారు. కరువు వెంటాడడంతో పంట చేతికి రాకుండా కళ్లముందే ఎండిపోయింది. తెలిసినవారి వద్ద అప్పు చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. కరువు ఛాయలతో చేసేందుకు పనిలేకపోగా కుటుంబపోషణ భారంగా మారింది. అప్పులు ఇచ్చినోళ్లు ఇంటిచుట్టూ తిరుగుతుండడంతో మనోవేదన చెందింది. అప్పు కట్టే స్థోమత లేక ఆత్మహత్యే శరణ్యమనుకుంది. ఈ నెల 3న పిల్లలిద్దరినీ పాఠశాలకు పంపించింది. అనంతరం ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన ముందే భార్య పురుగుల మందు తాగుతున్నా... కళ్లు కనిపించకపోవడంతో రవి ఏమీ చేయలేకపోయాడు. కిందపడి కొట్టుకుంటున్నా.. ఏం జరిగిందో తెలుసుకోలేకపోయాడు. ఇరుగుపొరుగు ఆ సమయంలో రమ కోసం ఇంటికి రాగా ఆమె ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను జమ్మికుంటలోని విజయ్‌సాయి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. అమ్మ ఆస్పత్రిలో ఉండగా, తండ్రి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండడంతో తాత(రమ తండ్రి) వచ్చి పిల్లలను చూసుకుంటున్నాడు. ఆస్పత్రిలో కుమారుడే తల్లికి సపర్యలు చేస్తున్నాడు. ఇప్పటికే రూ.1.50 లక్షల ఖర్చు రమ వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇప్పటికే లక్షన్నర రూపాయలు ఖర్చయ్యాయి. చేతిలో చిల్లి గవ్వలేక... కుటుంబాన్ని పోషించలేక... అప్పులు చెల్లించలేక చనిపోవాలని నిర్ణయించుకున్న రమ ప్రాణపాయస్థితిలో ఉండగా కుమారుడు అంజి తన తల్లిని బతికించాలని వేడుకుంటున్నాడు. ఇంటి పెద్ద దిక్కు చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో ఉంటే కనిపించినవారినల్లా తమ తల్లిని కాపాడాలని వేడుకుంటున్నాడు. తన తల్లి లేకుంటే నాన్న, తాను, చెల్లి ఎలా బతికేదంటూ కన్నీరు పెట్టుకుంటున్నాడు. మా అందరికీ అమ్మే దిక్కని, అమ్మ లేకుంటే తాము బతకలేమని విలపిస్తున్నాడు. మెరుగైన వైద్యం చేస్తే తన తల్లి బతికే అవకాశముందని డాక్టర్లు చెబుతున్నారని... చేతిలో చిల్లిగవ్వ లేక తామెలా వైద్యం చేయించేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటివరకు అయిన రూ.లక్షన్నర ఖర్చు ఆస్పత్రి వైద్యుడే భరిస్తున్నాడు. రమను బతికించాలనే తపనతో డాక్టర్ సురంజన్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. తన తల్లి ప్రాణాలు కాపాడేందుకు దాతలు ముందుకు రావాలని కుమారుడు అంజి, రమ తండ్రి ఐలమల్లు వేడుకుంటున్నారు. మెరుగైన వైద్యం అందితే బతికే అవకాశం రమ పరిస్థితి విషమంగా ఉంది. వారం రోజులుగా చికిత్స అందిస్తున్నాం. సకాలంలో తీసుకురావడం వల్ల చికిత్స చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆమెను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు మెరుగైన చికిత్సతో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారం రోజులుగా వెంటిలేటర్‌పై ఆక్సీజన్ అందిస్తూ ఖరీదైన మందులు వేస్తూ ప్రాణాలు కాపాడుతున్నాం. ఇప్పటికే రూ.లక్షన్నర ఖర్చు వచ్చింది. మరో రూ.లక్షన్నర ఖర్చయ్యే అవకాశముంది. దాతలు ముందుకు వస్తే ఆమెకు పునర్జన్మ ప్రసాదించినవారవుతారు. పేదరికం, కుటుంబపోషణలో ఇబ్బందులతో తొందరపాటులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరం. ఇద్దరు చిన్న పిల్లలు, తండ్రి అంధుడు అయిన ఈ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిస్తే బాగుంటుంది. దాతలు కూడా ముందుకు రావాలి. - సురంజన్, వైద్యుడు, విజయ్‌సాయి హాస్పిటల్ -
హేమలతా.. నన్ను క్షమించు
- పిల్లలు,అమ్మ నాన్నా జాగ్రత్త - ఉద్యోగం పర్మినెంట్ కాలేదని వేదన - సూసైడ్ రాసి గ్రామీణ బ్యాంకు తాత్కాలిక ఉద్యోగి ఆత్మహత్య - అనంతగిరిపల్లి శివారులో ఘటన - మృతుడు ప్రజ్ఞాపూర్ వాసి వర్గల్ :‘ఇరవై ఏళ్లుగా బ్యాంకులో పనిచేస్తున్నా ఉద్యోగం పర్మినెంట్ కాలేదు. చాలీచాలని జీతంతో కుటుంబ పోషణ భారమై ఆర్థిక ఇబ్బందులు... ఎవరైనా ప్రభుత్వ సంస్థల్లో టెంపరరీగా పని చే యొద్దు... హేమలతా.. నన్ను క్షమించు. తేజస్విని, వంశీని, అమ్మ, నాన్నలను మంచిగా చూసుకో’.. అని సూసైడ్ నోట్ రాసి గ్రామీణ వికాస్ బ్యాంక్ తాత్కాలిక ఉద్యోగి పురుగుల మందు తాగి బలవన్మరణం చెందాడు. ఈ ఘటన బుధవారం మండలంలోని అనంతగిరిపల్లి శివారు రాఘవేంద్ర కాలనీ వద్ద వెలుగు చూసింది. గౌరారం ఎస్ఐ మధుసూదన్‌రెడి కథనం ప్రకారం... గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్‌కు చెందిన పెర్క ఉప్పలయ్య(38)కు భార్య హేమలత, వంశీ(10), తేజస్వీ(4) అనే ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. దాదాపు ఇరవై ఏళ్ల నుంచి ప్రజ్ఞాపూర్ గ్రామీణ వికాస్ బ్యాంకులో తాత్కాలిక ప్రాతిపదికన పని చేశాడు. ఏడాది నుంచి జగదేవ్‌పూర్ గ్రామీణ వికాస్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఉద్యోగం పర్మినెంట్ అవుతుందనే ఆశతో ఇబ్బందులను భరి స్తూ నెట్టుకొస్తున్నాడు. వేతనం సరిపోక కుటుంబ పోషణ భారం కావడ ంతో ఆర్థి క సమస్యలు ఎదురయ్యాయి. అప్పులు పెరిగాయి. ఒకవైపు ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగం పర్మినెంట్ కాలేదని బాధ, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు అతణ్ణి మనోవేదనకు గురిచేశాయి. మంగళవారం ఉదయం డ్యూటీ నిమిత్తం జగదేవ్‌పూర్‌లోని గ్రామీణ వికాస్ బ్యాంకుకు వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పి బయలుదేరాడు. చీకటి పడినా ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు బ్యాంకు వారిని వాకబు చేస్తే రాలేదని తెలియడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బంధువులు, తెలిసిన వారిని ఆరా తీసినా ఫలితం దక్కలేదు. వర్గల్ మండలం అనంతగిరిపల్లి శివారులో ఉప్పలయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడినట్లు గౌరారం పోలీసులు బుధవారం ఉదయం గుర్తించారు. ఆత్మహత్యకు కారణాలు వివరిస్తూ రాసిన సూసైడ్ నోట్ మృతుని జేబులో లభించింది. వెంటనే ప్రజ్ఞాపూర్‌లోని కుటుంబీకులకు సమాచారమిచ్చారు. డ్యూటీకి వెళ్లిన ఉప్పలయ్య శవంగా మారాడనే పిడుగులాంటి వార్త తెలియడంతో భార్య హేమలత, తల్లిదండ్రులు, పిల్లలు హతాశులయ్యారు. పెద్దదిక్కు కోల్పోయి అల్లాడిపోయారు. గజ్వేల్ ఆసుపత్రి వద్దకు చేరుకుని మృతదేహంపై పడి బోరుమని విలపించారు. డాడీ అంటూ విలపిస్తున్న కొడుకును ఆపడం అక్కడున్న వారి తరం కాలేదు. ఓవైపు కుటుంబీకులు, మరోవైపు బంధువులు, మిత్రుల రోదనలతో ఆసుపత్రి వద్ద ఉద్విగ్న వాతావరణం అలుముకున్నది. భార్య హేమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్టు గౌరారం ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. -
కన్నపేగు పాషాణమైంది!
ఇద్దరు పిల్లల గొంతునులిమి ఆత్మహత్య చేసుకున్న దంపతులు నలుగురి ఉసురు తీసిన ఫైనాన్స్ వ్యాపారం కుటుంబ పోషణకు ఎంచుకున్న వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులు వెన్నాడాయి. చివరకు ఎంతో మోజుతో కట్టుకున్న ఇల్లు కూడా అప్పుల తీర్చేందుకు ఆహుతైంది. అయినా అప్పులు తీరలేదు.... జీవనంలో మార్పు రాలేదు. దీంతో బతుకు భారమైంది. అప్పులు ఇచ్చిన వారి నుంచి నిరంతరం హెచ్చరికలు అందుతున్నాయి... దిక్కుతోచలేదు. ఆత్మహత్యనే శరణ్యంగా భావించినా దంపతులు... తాము మరణిస్తే పిల్లలు అనాథలుగా మారుతారని లోలోనా కుమిలిపోయారు. అంతే... కన్న పేగు పాషాణమైంది. నిద్రిస్తున్న పిల్లల గొంతు నులిమి... తామూ.... శివమొగ్గ : వ్యాపారంలో నష్టాలు రావడంతో పాటు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న దంపతులు తమ ఇద్దరు పిల్లలను నిద్రలోనే హతమార్చి తామూ ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. శివమొగ్గ జిల్లా సాగర తాలూకా పోలీసుల సమాచారం మేరకు... చిక్కమంగళూరుకు చెందిన సురేష్(38)కు భద్రావతికి చెందిన గాయత్రి(28)తో కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి షాలినీ(8), ఇంద్రజిత్(3) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబంతో కలిసి వచ్చి సాగర్‌కు వచ్చిన సురేష్ ఇక్కడే ఇల్లు నిర్మించుకుని ఫైనాన్స్ వ్యాపారం మొదలు పెట్టాడు. కొత్తలో కొద్ది మేర వ్యాపారం సజావుగా సాగినా... రానురాను నమ్ముకున్న వాళ్లు మోసం చేయడంతో నష్టాలు రావడం మొదలైంది. వ్యాపారంలో నిలదొక్కుకునేందుకు తెలిసిన వారి వద్ద నుంచి అప్పు చేసి పెట్టుబడులు సమకూర్చుకున్నాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. వ్యాపారం పూర్తిగా నష్టపోవడంతో అప్పులు మిగిలాయి. అప్పుల వారి నుంచి ఒత్తిళ్లు ఎక్కువ అవుతుండడంతో ఉన్న ఇంటిని అమ్మి కొందరికి చెల్లించాడు. కుటుంబాన్ని జేపీ నగర్‌లోని అద్దె ఇంటికి మార్చాడు. ఈ నేపథ్యంలోనే తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలంటూ మళ్లీ ఒత్తిళ్లు మొదలయ్యాయి. పరిపరివిధాలుగా నచ్చచెప్పినా అప్పులు ఇచ్చిన వారు ససేమిరా అన్నారు. దీంతో దిక్కుతోచలేదు. భార్యతో కలిసి వేదనను పంచుకున్నాడు. అయినా ఇద్దరికీ మనస్థైర్యం దక్కలేదు. దీంతో సోమవారం తెల్లవారుజామున తమ సొంత ఊరు తరికెరెలో ఉన్న బంధువులకు సురేష్ ఫోన్ చేశాడు. తాము అందరం కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి ఫోన్ పెట్టేశాడు. నిద్రిస్తున్న ఇద్దరు పిల్లల గొంతు నులిమి హతమార్చారు. అనంతరం ఒకే ఛైర్‌పై దంపతలిద్దరూ నిలబడి ఉరి వేసుకున్నారు. తరికెరెలో ఉన్న వారి నుంచి ఫోన్ సమాచారం అందుకున్న సాగర్‌లో ఉన్న బంధువులు ఉదయం ఆరు గంటలకు సురేష్ ఇంటికి చేరుకుని పరిశీలించారు. గదిలో వృతదేహాలు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని డీవైఎస్పీ నందిని, ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి పరిశీలించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడంతో స్థానికులు కంటనీరు పెట్టారు. -
ఆదరణ తగ్గినా..అదే పని!
ఇప్పటికీ 80శాతం కుటుంబాలకు బీడీలే జీవనాధారం కుటుంబ పోషణకు కొండంత అండ పరిశ్రమల మూతతో ఆందోళనలో మహిళలు కాశిబుగ్గ : సిరిసిల్లకు చేనేత పరిశ్రమ ఎలానో .. వరంగల్‌కు బీడీ కార్ఖానాలు అంత. వరంగల్ తూర్పు పరిధిలో ఏ ఇంట చూసినా మహిళలు బీడీలు చుడుతూ కనిపిస్తారు. కాశిబుగ్గ, చార్‌బౌళి, గిర్మాజీపేట, కరీమాబాద్, రంగశాయిపేట, ఖిలావరంగల్, పుప్పాలగుట్ట, లేబర్‌కాలనీ ప్రాంతాలలో బీడీలు చుట్టడం రాని మహిళలు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఒక్క కాశిబుగ్గ పరిధిలోనే దాదాపు ఎనిమిది బీడీ పరిశ్రమలు ఉండడం గమనార్హం. అయితే క్రమంగా పరిశ్రమలు మూత పడుతుండడంతో మహిళలకు ఉపాధి కరువవుతోంది. ఒకప్పుడు తూర్పు పరిధిలో 12 కార్ఖానాలు ఉంటే ప్రస్తుతం రెండు మూడు మాత్రమే పనిచేస్తున్నాయి. 80శాతం కుటుంబాలు బీడీ పరిశ్రమ పైనే ఆధారపడి జీవించేవి. ప్రస్తుతం పరిశ్రమలు మూతపడినా ఉన్నవాటి పైనే ఆధారపడి బతుకులు వెళ్లదీస్తున్నాయి. అండగా నిలిచిన పరిశ్రమలు వరంగల్ తూర్పు పరిధిలో కూలినాలి చేసుకునే వాళ్లే ఎక్కువ. భర్త పనికి వెళ్లాక, ఇంట్లో పనులు పూర్తయ్యాక మహిళలు ఇంటి వద్దనే బీడీలు చుడుతూ కుటుంబ పోషణలో వేన్నీళ్లకు చన్నీళ్లలా ఉండేవారు. ఇంటిల్లిపాదీ బీడీలు చుడుతూ ఎప్పుడూ కళకళలాడేవి. ప్రస్తుతం బీడీ పరిశ్రమలు చాలావరకు మూతపడడం, బీడీల వాడకం తగ్గిపోవడంతో ఒకటిరెండు కార్ఖానాలు మాత్రమే మిగిలాయి. అయితే మహిళలు మాత్రం బీడీలు చుట్టడం మాత్రం మానలేదు. ఒకప్పుడు ఇంట్లోని ప్రతి ఒక్కరు బీడీలు చుడితే ప్రస్తుతం ఒకరు మాత్రమే ఆ పనిలో ఉంటున్నారు. వచ్చిన పనిని మర్చిపోలేక, మరో పనిలేక దీనిని వదులుకోలేకపోతున్నారు. కొంతమంది మహిళలు మాత్రం ప్రత్యామ్నాయంగా కూలి పనులకు వెళ్తున్నారు. పాత పని మర్చిపోలేక.. నేను 35 సంవత్సరాల నుంచి బీడీలు చుడుతున్నాను. ఒకప్పుడు బీడీల మీద మంచి ఆదాయం వచ్చేది. ఇప్పుడు బీడీలు చుట్టినా కార్ఖానాలు తగ్గిపోవడంతో తీసుకోవడం లేదు. పాత పని మరువలేక.. కొద్దో గొప్పో ఆసరాగా ఉంటుందని అదే పనిచేస్తున్నా. - దిడ్డి సుశీల, బీడీ కార్మికురాలు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలి మాకు బీడీలే జీవనాధారం.. దీని మీదనే కొద్దో గొప్పో ఆదాయం వస్తే ఇల్లు గడిచేది. ఇప్పుడు బీడీలు అంటే ఈసడించుకుంటాళ్లు. ప్రభుత్వం మాకు ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలి. మహిళలు ఇంటి వద్ద పనిచేసుకునే విధంగా ఉపాధి కల్పించాలి. -చంద్రకళ ఆదాయం తగ్గుతోంది ఒకప్పుడు నెలకు రూ.రెండు, మూడు వేలకుపైగా సంపాదించేదాన్ని. ఇప్పుడు బీడీలు చుడితే రూ.వెయ్యి మాత్రమే వస్తున్నాయి. కార్ఖానాలు బంద్ అయినయ్. మాకు ఉపాధి దొరకడం లేదు. - ఆడెపు సుజాత ఈ పని నడవడం కష్టమే.. ఒకప్పుడు బీడీలు తాగేటోళ్లు బాగా ఉండేటోళ్లు. చక్కెర బీడీలకు బాగా గిరాకీ ఉండేది. ఇప్పుడు బీడీలు ఎవరూ తాగడం లేదు. మరో ఐదు సంవత్సరాల తరువాత ఈ పని నడవడం కష్టమే. - ఆర్ల లలిత -
శ్రమయేవ జయతే !
నిరుపేద కుటుంబంలో పుట్టానని ఆమె ఏనాడూ కుంగిపోలేదు. కుటుంబ పోషణ భారమై తల్లిదండ్రులు బాలసదనంలో చేర్పించినా అధైర్యపడలేదు. అహర్నిశలు కష్టపడి విద్యనభ్యసించారు. గురువుల నమ్మకాన్ని నిలబెడుతూ..తల్లిదండ్రుల ఆశలు నెరవేరుస్తూ ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. విధి నిర్వహణలో రాణిస్తూ అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ కష్టేఫలి సూత్రానికి ఉదాహరణగా నిలిచారు. ఆమే కమలాపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ జయలక్ష్మి. కమలాపురం: పులివెందుల తాలూకా, తొండూరు మండలం గోటూరు గ్రామానికి చెందిన సాలెమ్మ, వెంకటేష్‌ల చివరి సంతానం జయలక్ష్మి. ఆమెకు ఐదుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. అసలే నిరుపేద కుటుంబం.. అపై సంతాన భారం ఎక్కువ. అలాంటి సమయంలో కడప అక్కాయపలెలోని ప్రాంతీయ బాలసదనం అధికారులు జయలక్ష్మిని తల్లిదండ్రుల సహకారంతో బాలసదనంకు తీసుకెళ్లారు. నిరుపేదలను తీర్చి దిద్దే ఆ సంస్థలో తమ చిన్నారి చదవడానికి తల్లిదండ్రులు పూర్తి అంగీకారం తెలిపారు. 1 నుంచి 10వ తరగతి వరకు జయలక్ష్మి బాలసదనంలో చదవుకున్నారు. కడప గర్ల్స్ కళాశాలలో ఇంటర్ పూర్తి కాగానే అంగన్వాడీ వర్కర్‌గా ఉద్యోగంలో చేరారు. వేంపల్లె మండలం పాలమూరులో తొలిసారిగా ఆమె ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. 1997లో పదోన్నతిపై గ్రేడ్-2 సూపర్వైజర్గా రాయచోటి నియోజకవర్గంలోని సుండుపల్లె మండలానికి సూపర్ వైజర్‌గా పని చేశారు. 2007లో బదిలీపై కమలాపురం వచ్చిన జయలక్ష్మి 2013లో గ్రేడ్-1 సూపర్ వైజర్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం కమలాపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని వీఎన్ పల్లె మండలంలో సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతిభకు దక్కిన పురస్కారం.. బాలసదనంలో చదివి ఉన్నత స్థానం పొందిన వారిని ఈనెల 14న విజయవాడలో జరిగిన చిన్నారుల దినోత్సవ వేడుకల్లో సన్మానించారు. అందులో భాగంగా జిల్లా నుంచి జయలక్ష్మిని సన్మానించారు. గోల్డ్ మెడల్, మెమెంటో, ప్రశంసా పత్రాలను ప్రిన్సిపల్ సెక్రటరి నీలం సహాని, మంత్రి పీతల సుజాత చేతుల మీదుగా అందుకుని శభాష్ అని పించుకున్నారు. ఈ అవార్డుకు ఎంపికైం ది జిల్లానుంచి ఈమె ఒక్కరే కావడం విశేషం. ఈ సందర్భంగా స్థానిక సీడీపీఓ శ్రీమతమ్మ, ఇతర సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు ఆమెను మంగళవారం అభినందించారు. -
బెల్గాంలో ఉద్రిక్తత
నాల్గవ జాతీయ రహదారి దిగ్బందం కార్మికులపై విరిగిన లాఠీ ప్రతిగా రాళ్లు రువ్విన ఆందోళనకారులు ఇద్దరు ఇన్స్పెక్టర్లతో సహా నలుగురు సిబ్బందికి గాయాలు సాక్షి, బెంగళూరు :ఇసుక రవాణాకు సంబంధించి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పాలసీ ఇద్దరు భవన నిర్మాణ రంగ కార్మికుల పాలిట వృత్యు పాశమైంది. ఈ విషయాన్ని ప్రశ్నించిన వందలాది సహచర కార్మికులపై బెల్గాం పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. వివరాలు... ఇసుక రవాణ, సేకరణ, క్రయవిక్రయాలకు సంబంధించి నాలుగు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీని తీసుకువచ్చింది. దీని ప్రకారం చాలా ప్రాంతాల్లో ఇసుక సేకరణ మందగించింది. ముఖ్యంగా బెల్గాం జిల్లాలో ఇసుక రవాణ, సేకరణ రంగంలోని వందలాది మంది కూలీలు ఉపాధి కోల్పోయారు. ఇసుక లభ్యం కాకపోవడంతో భవన నిర్మాణ రంగ కార్మికులు కూడా ఉపాధి కోల్పోయారు. ఈ నేపథ్యంలో కుటుంబ పోషణ భారమై రెండ్రోజుల క్రితం బెల్గాంలో ఇద్దరు కట్టడ కార్మికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషయంపై అధికారులు, స్థానిక నేతలు స్పందించకపోవడంతో భవన నిర్మాణ కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వందలాది మంది కార్మికులు సోమవారం నాల్గవ జాతీయరహదారిని దిగ్బందించారు. దాదాపు రెండు గంటల పాటు రోడ్డుకు ఇరువైపులా వాహనాలు వందల సంఖ్యలో నిలిచిపోయాయి. కార్మికులకు నచ్చచెప్పేందుకు పోలీసులు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆఖరుకు లాఠీ చార్జి చేసి, ఆందోళనకారులను చెదరగొట్టారు. పోలీసుల వైఖరి నిరసిస్తూ కార్మికులు రాళ్లు రువ్వారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లతో సహ నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అదనపు బలగాలను రప్పించి ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. లాఠీచార్జిలో గాయపడిన కార్మికులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్సలు అందిస్తున్నారు. పరిస్థితి అదుపులో ఉందని పోలీస్ అధికారులు వెల్లడించారు. -
పేదరికంపై పవర్ పంచ్
లక్ష్యం వారి కుటుంబాల నేపథ్యం సాధారణం.. అమ్మానాన్నలది కాయకష్టం.. కుటుంబ పోషణ కూడా వారికి కనాకష్టం... అయినా ఆ ఇద్దరమ్మాయిలు కష్టాలనే ఇష్టాలుగా మలుచుకుని పవర్ లిఫ్టింగ్‌లో ప్రతిభ చూపిస్తున్నారు. పతకాలు సాధిస్తున్నారు. ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడే బీజం పడ్డ వారి ఉన్నత లక్ష్యాన్ని ఏమాత్రం నిరుత్సాహ పరచకుండా తమకు చేతనైనంతగా ప్రోత్సాహం అందించారు అమ్మానాన్నలు. పవర్ లిఫ్టింగ్‌లో శిక్షణ పొందేందుకు నడుంకట్టిన ఈ అమ్మాయిలు ఎనిమిదేళ్లుగా కఠోర సాధన చేస్తూ జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. ఆ అమ్మాయిలే మంగళగిరికి చెందిన నగీనా, సలోమీలు. స్నేహితులైన ఈ ఇద్దరూ పవర్ లిఫ్టింగ్వైపు ఎలా అడుగులు వేశారంటే... నగీనా తండ్రి సుభాని మెకానిక్. అమ్మ అమీరున్నీసా గృహిణి. ముగ్గురు ఆడపిల్లల్లో రెండో అమ్మాయి నగీనా. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న నగీనాకు పవర్ లిఫ్టింగ్‌పై ఆసక్తి ఎలా కలిగిందో ఆమె మాటల్లోనే... సీకే గరల్స్ హైస్కూల్లో నా సీనియర్ మట్టుకొయ్య సలోమి, మరికొందరు... అంతర్జాతీయ పవర్ లిఫ్టర్, కోచ్ షేక్ సందాని వద్ద శిక్షణ పొందుతున్నారు. వారిని చూసి నాకు కూడా వెళ్లాలనిపించింది. ఇదే విషయం ఇంట్లో చెప్పా! అమ్మ ప్రోత్సహించడంతో ఎనిమిదో తరగతి (2006)లో ఉండగా పవర్ లిఫ్టింగ్ కోచింగ్‌కు వెళ్లడం మొదలుపెట్టా. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మధ్యలో కొన్నాళ్లు మానుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాలలో బీకాం (2010-13) చదువుతూ శిక్షణను కొనసాగించాను. ఏమి సాధించిందంటే... కృష్ణా యూనివర్సిటీ తరపున గుడివాడలో, విజయవాడ లయోల కళాశాలలో జరిగిన అంతర్ కళాశాలల పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 63 కేజీల కేటగిరీలో స్వర్ణపతకం, వర్సిటీ స్ట్రాంగ్ ఉమెన్ అవార్డు; గత జనవరిలో నిమ్రా కాలేజ్‌లో జరిగిన జేఎన్టీయూకే పరిధిలోని అంతర్ కళాశాలల పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్లోనూ గోల్డ్‌మెడల్; సౌత్ ఇండియా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో సీనియర్స్ విభాగం 63 కేజీల కేటగిరీలో గోల్డ్‌మెడల్. ఇక మట్టుకొయ్య సలోమీది మంగళగిరి మండలం మక్కెవారిపేట. తండ్రి చిన్నవెంకయ్య రాడ్ బెడ్డింగ్ పనిచేస్తారు. అమ్మ వరదానం గృహిణి. ఇబ్రహీంపట్నం నిమ్రా కాలేజీలోనే ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న సలోమి సీకే గరల్స్ హైస్కూల్లో చదివేటప్పుడు పీఈటీ ప్రోత్సాహంతో కోచ్ సందాని వద్ద చేరింది. అక్కడ తీసుకున్న శిక్షణతో 2008లో మిజోరాంలో జరిగిన జాతీయస్థాయి గ్రామీణ వెయిట్ లిఫ్టింగ్ టోర్నమెంట్లో కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత పవర్ లిఫ్టింగ్‌పై ఆసక్తి కలగడంతో ఆ దిశగా సాధన చేస్తోంది. సలోమీ ఏమి సాధించిందంటే... ఏఎన్‌యూ అంతర కళాశాలల పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్లలో 72 కేజీల కేటగిరీలో మూడేళ్లు వరుసగా బంగారు పతకాలు; సౌత్ ఇండియా స్థాయిలో కోయంబత్తూరు (2011)లో జరిగిన పవర్ లిఫ్టింగ్ టోర్నీలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్, హైదరాబాద్ (2012), కేరళ రాష్ట్రం (2013)లలో జరిగిన టోర్నమెంట్స్‌లో జూనియర్స్ విభాగంలో గోల్డ్ మెడల్స్, సీనియర్స్ విభాగంలో సిల్వర్ మెడల్స్. గత జనవరిలో నిమ్రా కాలేజ్‌లో జరిగిన జేఎన్టీయూకే పరిధిలోని అంతర కళాశాలల పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్లో గోల్డ్‌మెడల్. ఇటువంటి మట్టిలో మాణిక్యాలు రాష్ర్టంలో మరెందరో ఉన్నారు. వీరికి ప్రభుత్వ ప్రోత్సాహం, పెద్దల సహాయసహకారాలు లభిస్తే, ఎన్నో సంచలనాలు సృష్టించి, రాష్ట్రానికి వన్నె తెస్తారనడంలో సందేహం లేదు. - అవ్వారు శ్రీనివాసరావు, సాక్షి, గుంటూరు - ఫొటో: నందం బుజ్జి, మంగళగిరి -
సాగు కంటే పాడి బాగు
పాడి పెంపకంతో లాభాలు పెరుగుతున్న పాల దిగుబడులు గొలుగొండ రైతాంగం విజయగాథ గొలుగొండ : పుడమితల్లిని నముకున్నా.. వాతావరణం సహకరించక బడుగు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాడి లేకపోతే వారి దైనందిన పరిస్థితి ఊహించడమే కష్టం. మండల రైతులు రెండేళ్లుగా ఆరుగాలయం కష్టించి పనిచేసినా.. పంటలు ఆశాజనకంగా లేకపోవడంతో అధికశాతం మంది పాడివైపు దృష్టిమళ్లించారు. మార్కెట్లో పాలకు ఉన్న డిమాండ్‌తోపాటు, పాల సేకరణ ధరలు కూడా బాగుండడంతో కుటుంబ పోషణకు ఢోకాలేకుండా పోయింది. పెరిగిన పాల దిగుబడులు మండలంలో 8 వేల ఎకరాలకు పైగా సాగు భూములున్నా, ఏటా పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు రైతులను కుంగదీస్తున్నాయి. భూమిని నుమ్ముకుంటున్నా అప్పులే మిగులుతుండడంతో.. పాడివైపు దృష్టిసారించారు. ఇలా చేయడం వల్ల గతంలో కంటే పాల దిగుబడులు రెట్టింపవుతున్నాయి. ప్రధానంగా పాకలపాడు, ఏటిగైరంపేట, శ్రీరాంపురం, కొత్తమల్లంపేట, కేడీ పేట, పుత్తడిగైరంపేట, కొంకసింగి, జోగుంపేట తదితర ప్రాం తాల్లో డైరీలకు రైతులు ఈ వేసవిలో అధికమొత్తంలో పాల సరఫరా చేస్తున్నారు. గత ఏడాది రోజుకు 3,211 లీటర్లు సరఫరా కాగా ప్రన్తుతం4,300 లీటర్లు ఎగుమతవుతున్నాయి. ఈ గ్రామాల్లో మోటారు బోర్లు అధికంగా ఉండడం వల్ల నీటి సదుపాయం అందివచ్చి పశుగ్రాసాన్ని విస్తారంగా పెంచుతున్నారు. నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో గడ్డి పెరగడం, పాల సేకరణ ధర కూడా బాగుండడంతో ఈ ఏడాది కూడా మంచి లాభాలు వస్తాయని పాడి రైతులు ధీమాగా ఉన్నారు. డెయిరీల మధ్య పోటీ వివిధ డైయిరీలు పోటీ పడి మరీ రైతుల నుంచి పాలు కొనుగోలు చేస్తున్నాయి. మార్కెట్లో పాలకు డిమాండ్ పెరగంతోనే సేకరణ ధర కూడా భారీగా పెంచాయి. 2012-2013 లో లీటరు పాలకు రూ.46 ఉండగా ఇప్పుడు రూ.51కి చేరింది. ధర పెంచడంతోపాటు వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తున్నాయి.