కుక్క వచ్చిందని... భవనం పై నుంచి దూకిన కూలీలు | labour killed in visakhapatnam | Sakshi
Sakshi News home page

కుక్క వచ్చిందని... భవనం పై నుంచి దూకిన కూలీలు

Published Thu, Jun 9 2016 1:34 PM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

నిర్మాణంలో ఉన్న భవనంపై పని చేస్తున్న ముగ్గురు కూలీలు.. భవనంపై నుంచి కిందకి దూకిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

విశాఖపట్నం : నిర్మాణంలో ఉన్న భవనంపై పని చేస్తున్న ముగ్గురు కూలీలు.. భవనంపై నుంచి కిందకి దూకిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన విశాఖపట్నం నగరంలోని అక్కయ్యపాలెం లలితానగర్‌లో గురువారం చోటు చేసుకుంది. కూలీలు పని చేస్తున్న సమయంలో ఇంట్లోని పెంపుడు కుక్కను విడిచిపెట్టారు.

ఆ కుక్క డాబాపైకి వెళ్లింది. దీంతో భయాందోళనలకు గురైన కూలీలు భవనం పై నుంచి దూకేశారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా..కేజీహెచ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరిలో మరో వ్యక్తి కూడా మరణించాడు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement